News

యుగాంతం వచ్చేది అప్పుడే..? ఆరోజుల్లోనే చెప్పిన ఐజాక్ న్యూటన్.

వాతావరణంలో అనూహ్య మార్పులు, పర్యావరణానికి జరుగుతున్న తిరుగులేని నష్టం వల్ల ఉత్పాతాలు అధికమవుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వీటి ఫలితంగా ఆరోవిడత సామూహిక జీవవినాశనం దిశగా భూమి పరుగులు పెడుతున్నట్టు పేర్కొంటున్నారు. భూమిమీద జీవవ్యవస్థ తలకిందులు కావచ్చని, మొత్తంగా జీవమే అంతర్ధానం కావచ్చని అంటున్నారు. అయితే ఈ ప్రపంచంలో అపర మేధావులుగా ఐన్‌స్టీన్, సర్ ఐజాక్ న్యూటన్‌లను చెప్పుకుంటాం. ఐతే.. ఐన్‌స్టీన్ తన సిద్ధాంతాలకు సైంటిఫిక్ మార్గాన్ని అనుసరిస్తే.. న్యూటన్ సైంటిఫిక్‌తో పాటూ.. దైవత్వాన్ని కూడా ఆపాదించాడు.

దీనివల్లే న్యూటన్ కంటే ఐన్‌స్టీనే గొప్ప అనే వాదన బలపడింది. అది అలా ఉంచితే.. దైవత్వ కోణంలో ఆలోచించిన న్యూటన్.. బంగారాన్ని సొంతంగా తయారుచెయ్యవచ్చని నమ్మాడు. అలాగే యుగాంతం కూడా వస్తుందని బలంగా నమ్మాడు. యుద్ధాల ద్వారా కాకపోతే, ప్రకృతి విపత్తులు, భారీ భూకంపం వల్ల భూమి అంతం అవుతుందని నమ్మేవారూ ఉన్నారు. అయితే, ఇలాంటి వాదనలకు ఆధారాలు లేకపోవడంతో.. ఇవి నిలబడట్లేదు.

ఐజాక్ న్యూటన్‌కి కూడా అనూహ్యమైనది ఏదో జరుగుతుందనే నమ్మకం బలంగా ఉండేది. ఆయన చనిపోయే ముందు రోజుల్లో.. అనూహ్యమైన అంచనాలు వెయ్యడం ప్రారంభించాడు. అందులో యుగాంతం కూడా ఒకటి. దాన్నే ఆయన భూమి వినాశన కాలంగా చెప్పాడు. లాడ్‌ బైబిల్ మీడియా నివేదిక ప్రకారం, 2060లో అంటే మరో 36 సంవత్సరాల్లో ప్రపంచం నాశనం అవుతుందని న్యూటన్ అంచనా వేశాడు. న్యూటన్ శాస్త్రవేత్త అయినప్పటికీ.. మతాలని అత్యంత బలంగా నమ్మేవాడు. అతను బైబిల్ లోని సమాచారాన్ని ప్రజలతో పంచుకునేవాడు. శాస్త్రీయ లెక్కలకు బైబిల్ సమాచారాన్ని మిక్స్ చేసి.. యుగాంతాన్ని అంచనా వేశాడు.

లాడ్ బైబిల్ మీడియా ప్రకారం.. కెనడా లోని న్యూటన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ స్టీఫెన్ స్నోబెలెన్ ఇలా అన్నారు, “ఈ ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త కూడా. ఆయన మతపరమైనవాడు కూడా. ఆయన నోటి నుంచి చాలా బైబిల్ కథలు తరచుగా వినిపించేవి” తన బ్లాగ్‌లలో ఒకదానిలో, స్టీఫెన్ స్నోబెలెన్ ఇలా రాశాడు, ‘సర్ ఐజాక్ న్యూటన్ దేవుణ్ణి నమ్మాడు. అతనికి బైబిల్ మీద కూడా విశ్వాసం ఉండేది. ఏదో ఒక రోజు ప్రపంచం అంతిమంగా నాశనం అవుతుందని అతను నమ్మాడు.

కానీ ఈ సైంటిస్ట్ ఎప్పుడూ బైబిల్ భాషని నేరుగా ఉపయోగించలేదు. న్యూటన్ క్రైస్తవుల గ్రంథం నుంచి సమాచారాన్ని లెక్కించాడు” ఈ ప్రపంచం 2065లో నాశనం అవుతుందనే అంచనాను ఫ్రాన్స్ తత్వవేత్త నోస్ట్రడామస్ వేసినట్లు చెబుతుంటారు. అంటే అటు న్యూటన్, ఇటు నోస్ట్రడామస్ ఇద్దరూ యుగాంతానికి దాదాపు ఒకే రకమైన టైమ్ ఇచ్చినట్లైంది. ఐతే.. ప్రపంచం పూర్తిగా నాశనమైపోదని న్యూటన్ అంచనా. ఈ ప్రపంచం నాశనమై, కొత్త ప్రపంచం పుడుతుందని న్యూటన్ తెలిపాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker