Health

Cooked Foods: వండిన ఆహారాలను ఫ్రిజ్‌లో ఎంత సేపు ఉంచాలో తెలుసా..? పొరబాటున ఎక్కువసేపు పెడితే..?

Cooked Foods: వండిన ఆహారాలను ఫ్రిజ్‌లో ఎంత సేపు ఉంచాలో తెలుసా..? పొరబాటున ఎక్కువసేపు పెడితే..?

Cooked Foods: ఆహారం త్వరగా చెడిపోకుండా ఉండేందుకు, ఎక్కువ సేపు పాడైపోకుండా ఉండేందుకు ఆహారాన్ని తయారు చేసి ఫ్రిజ్‌లో పెట్టే అలవాటు చాలా మందిలో ఉంటుంది. సమయాన్ని ఆదా చేయడానికి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేస్తారు. రిఫ్రిజిరేటర్‌లో మిగిలిపోయిన వాటిని నిల్వ చేయడం ఉద్దేశ్యం ఆహారం వృధా కాకుండా నిరోధించడం లేదా సమయాన్ని ఆదా చేయడం.

Also Read : Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా..?

ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారం పాడైపోకుండా కాపాడుతుంది. అయితే చపాతీ పిండిని చాలా మంది కలిపి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతారు. చపాతీ పిండిని ఎప్పుడైనా ఎప్పటికప్పుడు కలిపి యూజ్ చేసుకోవడం మేలు. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన పిండి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అలాగే అన్నాన్ని కూడా ఎప్పటికప్పుడు వండి తినడం మంచిది. ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడదు.

చాలా మంది రసం, పప్పు చారు, సాంబార్ వంటివి కూడా పెడుతూ ఉంటారు. ఇలాంటివి కూడా ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచకూడదు. రెండు రోజులకు మించి నిల్వ చేయకూడదు. ఎక్కువ రోజులు చేస్తే అందులో ఉన్న పోషకాలు నశించి, జీర్ణ సమస్యలు రావచ్చు. చాలా మంది రసం, పప్పు చారు, సాంబార్ వంటివి కూడా పెడుతూ ఉంటారు. ఇలాంటివి కూడా ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచకూడదు.

Also Read : Stone Fruits : ఈ పండు కనపడగానే తినేయండి, ఎందుకంటే..!

రెండు రోజులకు మించి నిల్వ చేయకూడదు. ఎక్కువ రోజులు చేస్తే అందులో ఉన్న పోషకాలు నశించి, జీర్ణ సమస్యలు రావచ్చు. కోడి గుడ్లను కూడా ఎక్కువ రోజులు నిల్వ చేయకూడదు. ఎప్పటికప్పుడు ఉపయోగిస్తూ ఉండాలి. అలాగే సపరేటుగా ఓ బాక్సులో స్టోర్ చేయాలి. అదే విధంగా ఫ్రిజ్‌ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. లేదంటే అనారోగ్య సమస్యలు రావచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker