News

Simran Love: హీరోయిన్ సిమ్రాన్ ఎంత మంది హీరోలతో ఎఫైర్‌ నడిపించిందో తెలుసా..?

Simran Love: హీరోయిన్ సిమ్రాన్ ఎంత మంది హీరోలతో ఎఫైర్‌ నడిపించిందో తెలుసా..?

Simran Love: ముంబైకి చెందిన సిమ్రాన్ ఎక్కువగా సౌత్ ఇండస్ట్రీలోనే పాపులర్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఇప్పుడు ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన ఫ్యామిలీతోనూ గడుపుతుంది. అయితే పదేళ్లపాటు తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన సిమ్రాన్‌ అత్యంత సక్సెస్‌ ఫుల్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. అదే సమయంలో ప్రేమ కథల విషయంలోనూ వార్తల్లో నిలిచింది.

అప్పట్లో ఆమె చుట్టూ చాలా ప్రేమ కథలు పుట్టుకొచ్చాయి. తాను పని చేసిన హీరోలతో ఆమె ప్రేమలో పడినట్టు, రహస్య ప్రేమ వ్యవహారాలు నడిపినట్టు వార్తలు వచ్చాయి. చాలా మంది హీరోలతో సిమ్రాన్‌ రొమాంటిక్‌ రిలేషన్స్ ని మెయింటేన్‌ చేసిందన్నారు. అందులో భాగంగా మొదట అబ్బాస్‌తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. సిమ్రాన్‌ తమిళంలో నటించిన తొలి చిత్రం వీఐపీ, ఇందులో ప్రభుదేవా, అబ్బాస్‌ హీరో. అబ్బాస్‌కి జోడీగా సిమ్రాన్‌ నటించింది.

Also Read: ఉదయాన్నే ఈ భాగాలలో నొప్పులు వస్తున్నాయా..?

ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్‌ అయ్యింది. ఇద్దరు ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరిగింది. అంతేకాదు ఇద్దరు పెళ్లి చేసుకుంటారనే రూమర్స్ వచ్చాయి. అబ్బాస్‌.. సిమ్రాన్‌ని మ్యారేజ్‌ చేసుకోవాలనుకున్నాడట. కానీ సన్నిహితుల సలహా మేరకు ఆయన సిమ్రాన్ కి బ్రేకప్‌ చెప్పాడట. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రభుదేవా సోదరుడు, డాన్స్ మాస్టర్‌ రాజు సుందరం ఆమె ప్రేమలో పడ్డాడట. సిమ్రాన్‌ నటించిన చాలా సినిమాలకు రాజు సుందరం డాన్స్ మాస్టర్ గా పనిచేశారు. అంతేకాదు హీరోగా ఐ లవ్యూ దా వంటి సినిమాలో నటించారు.

Also Read: అలెర్ట్, మీ మూత్రం వాసన వస్తుందా..?

ఈ క్రమంలో సిమ్రాన్‌తో ఆయన ప్రేమలో పడ్డారట. చాలా కాలం పాటు ఈ ఇద్దరు లవ్‌ స్టోరీని నడిపించారని టాక్‌. వీరు కూడా పెళ్లి వరకు వెళ్లారట. ప్రభుదేవా, నయనతారల ప్రేమ వ్యవహారం పెద్ద రచ్చకావడంతో.. రాజు సుందరం మాస్టర్‌ సిమ్రాన్‌కి గుడ్‌ బై చెప్పాడట. మరోవైపు లోకనాయకుడు కమల్‌ హాసన్‌ తోనూ సిమ్రాన్‌ ఎఫైర్‌ పెట్టుకుందని అంటున్నారు. ఈ ఇద్దరు కలిసి పంచతంత్రం చిత్రంలో నటించారు. ఇందులో రెచ్చిపోయి రొమాన్స్‌ చేశారు.

Also Read: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..?

ఆ కెమిస్ట్రీ చూశాక ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారనే రూమర్స్ వచ్చాయని ప్రముఖ జర్నలిస్ట్ చెయ్యర్‌ బాలు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వీటి అన్నింటికి పుల్‌ స్టాప్‌ పెడుతూ సిమ్రాన్‌ 2003లో తన చిన్ననాటి స్నేహితుడు దీపక్‌ బగ్గాని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కొడుకులు. పెళ్లి తర్వాత సిమ్రాన్‌ సినిమాలు తగ్గించింది. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ కొంత కాలం తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి మెప్పిస్తుంది. ఇటీవల టూరిస్ట్ ఫ్యామిలీతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకుని సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker