Period Pain: పీరియడ్స్ సమయంలో ఆ నొప్పులు వేధిస్తున్నాయా..? వెంటనే మీరేం చెయ్యాలంటే..?

Period Pain: పీరియడ్స్ సమయంలో ఆ నొప్పులు వేధిస్తున్నాయా..? వెంటనే మీరేం చెయ్యాలంటే..?
Period Pain: పీరియడ్ సమయంలో ఈ నొప్పి ఓ మాదిరిగా, హెచ్చుతగ్గులు లేకుండా ఉండవచ్చు. లేదంటే తీవ్రంగా, బాధాకరంగా తెరలు తెరలుగా వచ్చి పోతుండవచ్చు. ఈ సమయంలో మహిళలకు తలనొప్పి, వాంతులు అవుతున్నట్లుగా ఉండటం, విరేచనాలు కూడా రావచ్చు. అయితే పీరియడ్స్ సమయంలో కాళ్ల నొప్పి లేదా కండరాల నొప్పి ఉంటే.. కాళ్లపై హీట్ ప్యాడ్ తో మసాజ్ చేయండి.

ఇది నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. హీట్ ప్యాడ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నొప్పిని తగ్గిస్తుంది. పీరియడ్స్ టైంలో వచ్చే కాళ్ల నొప్పులకు.. మసాజ్ మంచి చికిత్స. లావెండర్ లేదా ఆవనూనెతో మసాజ్ చేయవచ్చు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కాళ్లకు మసాజ్ చేయడం వల్ల అలసట తగ్గుతుంది. విశ్రాంతి లభిస్తుంది. వ్యాయామం.. కాళ్ళ నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది.
Also Read: ఉదయాన్నే ఈ భాగాలలో నొప్పులు వస్తున్నాయా..?
వ్యాయామం చేసినప్పుడు.. మెదడు నొప్పిని తగ్గించే ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. వ్యాయామం.. రక్త ప్రసరణకు సహాయపడుతుంది. ఇది కాళ్ల నొప్పి, కండరాల నొప్పులను తగ్గిస్తుంది. అయితే తేలికపాటి వ్యాయామాలు చేయడం మంచిది. పోషకాల లోపం కాళ్లలో నొప్పి, కండరాల నొప్పులకు కారణమవుతుంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో సరైన పోషకాలు తీసుకోండి.
Also Read: మీ మూత్రం వాసన వస్తుందా..?
విటమిన్ డి, జింక్, మెగ్నీషియం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్న ఆహారాలు తీసుకోవడం మంచిది. నెలసరి సమయంలో హైడ్రేట్ గా ఉండటం చాలా ముఖ్యం. సరిపడా నీరు తాగక పోవడం కూడా కాళ్ల నొప్పులకు కారణం కావచ్చు. కాబట్టి వాటర్ మంచిగా తాగండి. దోసకాయ, పుచ్చకాయ వంటి వాటిని డైట్ లో చేర్చుకోండి.