Grey Hair: మీ తెల్ల జుట్టుని ఈ చిట్కాలు ద్వారా 5 నిమిషాల్లోనే నల్లగా మార్చుకోవచు.

Grey Hair: ఉరుకుల పరుగుల జీవితం, పొల్యూషన్, మనం తినే ఆహారం కారణగా చిన్న వయసులోనే చాలా మంది జుట్టు సమస్యలతో సతమతమవుతున్నారు. ఇలాంటి సమయాల్లో ఖరీదైన షాంపూలు, కండిషనర్లు సీరమ్‌లు వాడుతుంటాం. అయితే ఈ రోజుల్లో చాలామందికి జట్టు తెల్లగా మారడం చూస్తున్నాం. వయసు పెరగడం వల్ల మాత్రమే కాకుండా, మానసిక ఒత్తిడి, జన్యుపరమైన కారణాలు, పోషకాహార లోపం వంటి అనేక కారణాల వల్ల చిన్న వయస్సులోనే జట్టు తెల్లగా మారుతుంది.

ఇది తెల్ల జుట్టును తాత్కాలికంగా దాచడానికి అత్యంత సులభమైన, వేగవంతమైన పరిష్కారాల్లో ఒకటి. మస్కారా లాగా ఉండే ఈ స్టిక్‌ను నేరుగా తెల్ల జుట్టుపై అప్లై చేస్తే వెంటనే ఫలితం కనిపిస్తుంది. అయితే.. తలస్నానం చేస్తే రంగు పోవచ్చు, లేదా వర్షం లేదా చెమట వల్ల రంగు పోతుంది. తెల్లని జుట్టును నల్లగా మార్చేందుకు రూట్ కన్సీలర్ స్ప్రే ఒక ఉత్తమ పరిష్కారం. జుట్టు కుదుళ్లలో కనిపించే తెల్ల జుట్టుపై సుమారు 6–8 అంగుళాల దూరం నుండి స్ప్రే చేయాలి.
Also Read: భార్యాభర్తల బంధం బలపడాలంటే..!
దీంతో తెల్ల జుట్టు చిటికెలో నల్లగా మారుతుంది. అయితే.. తక్కువ పరిమాణంలో స్ప్రే చేయడం ఉత్తమం. అధికంగా స్ప్రే చేస్తే జుట్టు అట్ట కట్టినట్లు కనిపించవచ్చు. ఇది కూడా తాత్కాలిక పరిష్కారమే, ఒక్కసారి తలస్నానంతో పోతుంది. అత్యవసర సమయాల్లో ఈ స్ప్రే చాలా సులభంగా ఉపయోగించవచ్చు. ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కలర్ డ్రై షాంపూలు తెల్ల జుట్టును తాత్కాలికంగా దాచడంలోనూ, జుట్టును ఒత్తుగా, నిగనిగలాడేలా మార్చేందుకు సహాయపడతాయి.
Also Read: ఉదయాన్నే ఈ భాగాలలో నొప్పులు వస్తున్నాయా..?
తెల్ల జుట్టు ఉన్న ప్రాంతాల్లో స్ప్రే చేసి, వెంట్రుక కుదుళ్లలో మసాజ్ చేయండి. జుట్టుకు కొత్త రూపాన్ని ఇస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.తెల్ల జుట్టును నల్లగా మర్చేందుకు హెయిర్ కలరింగ్ పౌడర్ ఒక చక్కటి ఎంపిక. తక్కువ మొత్తంలో తెల్ల జుట్టును తాత్కాలికంగా కవర్ చేయడానికి దీని వాడుతారు. పౌడర్ రూపంలో ఉండే ఈ ప్రాడక్ట్ ను బ్రష్ ద్వారా తెల్ల జుట్టుపై అప్లై చేయాలి. ఇది న్యాచురల్ ఫినిష్‌ను ఇస్తుంది.
Also Read: మీ మూత్రం వాసన వస్తుందా..?
అయితే.. దీని అప్లై చేసేటప్పుడు లేదా తరువాత బట్టలపై పడే ప్రమాదం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. వర్షం లేదా చెమటవలన రంగు కరిగిపోయే అవకాశం ఉంది. తలస్నానం చేసిన వెంటనే పొతుంది. అత్యవసర సమయంలో వేగంగా, సహజంగా తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు ఇది ఒక చక్కని తాత్కాలిక పరిష్కారం. నుదుటి అంచున లేదా చెవుల పైన ఉన్న తెల్ల జుట్టును దాచడానికి ఈ పెన్సిళ్ళు ఉపయోగపడతాయి.
Also Read: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..?
పెన్సిల్‌ని తెల్ల జుట్టు ఉన్న చోట రాస్తే సరిపోతుంది. చిన్న చిన్న వైట్ ప్యాచ్ లను కవర్ చేయడానికి బెటర్ ఛాయిస్. అధికంగా ఉపయోగిస్తే కృత్రిమంగా కనిపించే ప్రమాదం ఉంటుంది. తాత్కాలిక అవసరాలకు ఇది సులభమైన పరిష్కారం.