Health

Time To Sleep: ప్రతి రోజు రాత్రి 10గంటలలోగా నిద్రపోతే చాలు, మీకు ఎలాంటి అనారోగ్యసమస్యలు రావు.

Time To Sleep: ప్రతి రోజు రాత్రి 10గంటలలోగా నిద్రపోతే చాలు, మీకు ఎలాంటి అనారోగ్యసమస్యలు రావు.

Time To Sleep: సూర్యాస్తమయం తర్వాత త్వరగా నిద్రపోవడం, ఉదయం త్వరగా నిద్ర మేల్కొనడం అనేది మెరుగైన ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అనేక పరిశోధనల ఆధారంగా ప్రతి ఒక్కరికి కనీసం ఏడు గంటల నిద్ర అవసరమని తెలియజేస్తున్నాయి. అయితే మన శరీరం సూర్యోదయం, సూర్యాస్తమయానికి అనుగుణంగా పనిచేసే సహజమైన సిర్కాడియన్ లయపై ఆధారపడి ఉంటుంది. దీనిని మెరుగ్గా నిర్వహించాలంటే సమయానికి పడుకోవడం చాలా అవసరం.

ఆలస్యంగా నిద్రపోవడం మన ఆరోగ్యంపై అనేక ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. సమయానికి నిద్రపోవడం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరం విశ్రాంతిగా ఉండటానికి తగినంత సమయం దొరికినప్పుడు, మన మానసిక స్థితి మెరుగవుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది. శారీరక సామర్థ్యం కూడా మెరుగవుతుంది. తద్వారా మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలు దూరంగా ఉంటాయి.

Also Read: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..?

అలాగే, సమయానికి నిద్రపోవడం మన శరీరంలోని కార్టిసాల్ వంటి ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మరొక ముఖ్యమైన అంశం, సమయానికి నిద్రపోవడం మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మంచి నిద్ర వల్ల తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరిగి శరీరం వ్యాధులతో బలంగా పోరాడగలదు. ఇవే కాదు, ఆకలి నియంత్రణలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

Also Read: మీ మూత్రం వాసన వస్తుందా..?

నిద్రలేమి ఉన్నప్పుడు గ్రెలిన్ అనే ఆకలికి సంబంధిచిన హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. లెప్టిన్ అనే తృప్తి హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది అధికంగా ఆహారం తీసుకోవడం, బరువు పెరగడానికి దారి తీస్తుంది. త్వరగా పడుకోవడం వల్ల ఈ హార్మోన్ల సమతుల్యతను సాధించవచ్చు. మానసిక ఆరోగ్య పరంగా కూడా సమయానికి నిద్రపోవడం ఎంతో మేలు చేస్తుంది. తగినంత నిద్ర లేకపోతే మనసు అశాంతిగా మారుతుంది.

Also Read: ఉదయాన్నే ఈ భాగాలలో నొప్పులు వస్తున్నాయా..?

ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ, సరైన సమయంలో పడుకొని సరిపడా నిద్రపోతే, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మానసిక స్థితి మెరుగవుతుంది. ఈ అన్ని కారణాల వల్ల, ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా మన నిద్రపోయే సమయాన్ని నియంత్రించుకోవాలి. చివరగా, ఈ సూచనలు పాటించే ముందు తప్పనిసరిగా వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker