Life Style

Ashada Masam: ఆషాడ మాసంలో మహిళలు గోరింటాకు ఎందుకు పెట్టుకొవాలో తెలుసుకోండి.

Ashada Masam: ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఒక సంప్రదాయం. ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ మాత్రమే కాదు దీని వెనుక అనేక ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. అయితే పల్లెల్లో గోరింటాకు పండుగను జరుపుకుంటున్నారు. చెట్టు నుండి కోసుకొని తెచ్చిన మైదాకును రోట్లో వేసి రుబ్బి ఒకరికొకరు చేతులకు పెట్టుకుంటూ మురిసిపోతున్నారు.

మహిళలంతా ఒకచోట చేరి అందరూ కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఒకరికొకరు గోరింటాకును పెట్టుకుని మురిసిపోతున్నారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహిళలు సామూహికంగా ఈ గోరింటాకు సంబురాలను ఆనందోత్సహాల నడుమ జరుపుకుంటున్నారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పండుగ జరుపుకోవడం అనాదిగా ఆచారం. ఈ గోరింటాకు పండుగ వెనుక ఎన్నో పురాణ గాథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి.

Also Read: కాశీలో శివుని భక్తిలో లీనమైపోయిన టాలీవుడ్ హీరోయిన్..!

ఈ గోరింటాకునే గౌరీ ఇంటి ఆకు అని పిలుస్తారని, అమ్మవారికి ప్రతిరూపంగా దీన్ని భావిస్తారని చెబుతారు. ఇప్పుడంటే రకరకాల కోన్‌లు అందుబాటులో వచ్చాయి. కానీ ఒకప్పుడు మైదాకు చెట్టు నుండి కోసుకొని తెచ్చి, దాన్ని రోట్లో రుబ్బి రాత్రి పడుకునేముందు పెట్టుకొని, తెల్లవారి మైదాకును కడిగేసి, ఎర్రబడ్డ చేతులను చూసుకొని మురిసిపోయేవారు. ప్రస్తుతం కోన్‌లు రెడిమేడ్ గానే దొరుకుతున్నాయి.

Also Read: ఫిష్ వెంకట్ బతకాలంటే అదొక్కటే మార్గం అంటూ అసలు విషయం చెప్పేసిన డాక్టర్స్.

అంతే కాకుండా రకరకాల డిజైన్లలో గోరింటాకు పెట్టేవాళ్ళు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం పెళ్లిళ్లలో మెహిందీ పేరిట వేడుకలను కూడా జరుపుకుంటున్నారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే రుతువు మారిన వేళ కాళ్లు, చేతులు, గోళ్లు శుభ్రపడతాయని, అంటు వ్యాధులను కూడా దూరం చేస్తుందని నమ్మకం. అంతేకాకుండా శరీరంలోని వేడిని తగ్గించే ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది.

Also Read: ఈ నటుడు జాతీయ అవార్డ్ విన్నర్.

బయటి వాతావరణానికి అనుగుణంగా శరీరాన్ని కూడా చల్లబరిచి అనారోగ్యం బారిన పడకుండా మేలు చేస్తుందని కూడా చెబుతారు. అందుకే ఈ నెలలో మహిళలు, యువతులు సామూహికంగా ఆలయాల్లో, ఇళ్లలో గోరింటాకును పెట్టుకుని సందడి చేస్తున్నారు. ఏళ్ల తరబడి వస్తున్న సంప్రదాయాలకు ఇప్పటికీ ప్రాధాన్యమిస్తూ వాటిని పాటిస్తుండటం విశేషంగా చెప్పవచ్చు.

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker