News

అవకాశాలు కోసం ఆ విషయంలో హద్దులు చెరిపేసిన అనుపమ పరమేశ్వరన్.

అనుపమ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఎప్పుడు తన హద్దుమీరలేదు. చాలా వరకు సంప్రదాయబద్ధంగానే కనిపించింది. అయితే టిల్లూ స్క్వేర్ మూవీ కోసం మాత్రం ఈ బ్యూటీ చెల‌రేగిపోతోంది. తాజాగా బోల్డ్ లుక్ తో కనిపించడంతో అనుపమ ఫ్యాన్స్ కొందరు హార్ట్ అవుతున్నారు. మరోవైపు టిల్లూ స్క్వేర్ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ఆడియెన్స్ లో విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి.

టికెటే కొనకుండా, రాధిక సాంగ్స్ అయితే సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. ఈ చిత్రానికి మ‌ల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తాజా సినిమా ‘టిల్లు స్క్వేర్’ #TilluSquare లో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) పక్కన చేస్తోంది. ఇది ‘డీజే టిల్లు’ #DJTillu కి సీక్వెల్ గా వస్తోంది. మొదటి సినిమాలో కొంచెం అడల్ట్ జోకులు ఉండటం,

మామూలుగా సిద్ధు సినిమాల్లో కూడా అవి ఎక్కువగా కనపడటం, అటువంటిది అనుపమ ఇప్పుడు సిద్ధు నటిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా నటించడంతో అనుపమ అభిమానులు ఒక్కసారిగా నిరాశపడ్డారు. ఇంతకు ముందు విడుదలైన పాటలు రెండూ పెద్ద విజయం సాధించాయి కానీ, అందులో అనుపమ చాలా గ్లామర్ గా కనిపించడం, ఇంతకు ముందు ఏ సినిమాలోనూ ఇంత గ్లామర్ పాత్రలు చేయకపోవటంతో అభిమానులు ఒక్కసారిగా కంగుతిన్నారు.

ఇదిలా ఉంటే, నూతన సంవత్సరం కానుకంగా ‘టిల్లు స్క్వేర్’ నుండి ఒక పోస్టర్ విడుదలైంది. అందులో అనుపమ సిద్ధు జొన్నలగడ్డ వొళ్ళో కూర్చొని వుంది. ఆ ఇద్దరూ కొంచెం ఇంటిమసీ తో వున్న ఆ పోస్టర్ చూసి అనుపమ అభిమాని ఒకరు ‘ఈ పోస్టర్ చూసాక, నా హృదయం భగ్నం అయింది, ఇక నేను సాయి పల్లవి అభిమానిని అయిపోతాను’ అని కామెంట్ పెట్టాడు.

ఇంకొక అభిమాని కూడా అలాంటి పోస్టునే పెట్టాడు. ఇంకో అభిమాని అయితే హార్ట్ బ్రేక్ తో ఇయర్ పూర్తయింది అని కామెంట్ చేసాడు. ఇలా అనుపమ అభిమానులు అందరూ చాలా నిరాశ పడి ఆమె పెట్టిన ఈ పోస్టర్ కి కామెంట్స్ పెడుతున్నారు. అనుపమ రవి తేజ నటించిన ‘ఈగిల్’ సినిమాలో కూడా వుంది. ఈ సినిమా సంక్రాంతి పండగకి విడుదలవుతోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker