సొంత చెల్లినే లేపుకుపోయి పెళ్లి చేసుకున్న హీరో శివాజీ. అసలేం జరిగిందంటే..?
తన భార్య శ్వేతకు షూటింగ్ అంటే తెలియదని.. తనకు సినిమాల గురించి కూడా ఎక్కువగా పరిచయం లేదని చెప్పాడు శివాజీ. శివాజీ ఉన్నతమైన భావాలు ఉన్న వ్యక్తి కావడం వల్ల రూపాయి కట్నం తీసుకోకుండా శ్వేతను పెళ్లి చేసుకున్నాడు. తను సెలబ్రిటీ అయినా కూడా చాలా సామాన్య వ్యక్తిగా జీవిస్తుంటాడు శివాజీ. అయితే శివాజీ నటన మానేసి చాలా కాలం అవుతుంది. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.
నైన్టీస్ టైటిల్ తో సిరీస్ తెరకెక్కింది.నటుడిగా మరోసారి తన ఫ్యాన్స్ ని అలరించనున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ కి ముందు బిగ్ బాస్ వంటి పాపులర్ షోలో పాల్గొనడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఆంధ్రప్రదేశ్ విభజన నన్ను కలిచివేసింది. అందుకే నటన మానేశానని శివాజీ గతంలో చెప్పాడు. మొదట్లో ఆయన టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలను విమర్శించాడు. అనంతరం టీడీపీ సానుభూతిపరుడిగా మారి కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించాడు.
అలాగే వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ప్రసంగాలు ఇచ్చాడు. ఒక దశలో శివాజీ వైసీపీ పార్టీకి బద్ధ శత్రువు అయ్యాడు. వైసీపీ సోషల్ మీడియా శివాజీ వ్యక్తిగత విషయాలు తెరపైకి తెచ్చింది. వారు ఒక తీవ్ర ఆరోపణ చేశారు. బ్రతుకుదెరువు కోసం పిన్ని ఇంటికి వెళ్లిన శివాజీ, ఆమె కూతురిని లేపుకుపోయాడు. సొంత చెల్లినే లేపుకు పోయిన నీచ చరిత్ర, అంటూ కామెంట్స్ చేశారు.
ఈ ఆరోపణల మీద శివాజీ ఓ సందర్భంలో వివరణ ఇచ్చాడు. చెల్లిని లేపుకుపోయానని వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. నా భార్య పేరు శ్వేత. ఆమెది తెలంగాణ. ఒక ఫంక్షన్ లో కలిశాము. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాము. నేను కట్నం కూడా తీసుకోలేదు.
నా సొంత డబ్బులతో పెళ్లి చేసుకున్నానని వివరణ ఇచ్చారు. మరి వైసీపీ పార్టీ వాళ్ళు చేసే ఆరోపణలు శ్వేతతో పెళ్ళికి ముందు జరిగిన సంఘటనలా? లేక వారు అవాస్తం ప్రచారం చేస్తున్నారా? అనేది తెలియదు. శివాజీ మాత్రం అదంతా తన ఇమేజ్ దెబ్బ తీసేందుకు జరుగుతున్న కుట్ర అంటారు.