News

అయోధ్య రామ మందిర ఆహ్వాన పత్రం, ఎంత అద్భుతంగా ఉందో చుడండి.

ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర పట్టణంలో కొత్తగా నిర్మించిన రామాలయంలో వేడుక కోసం ఆహ్వాన కార్డులు పూజారులు, దాతలు, పలువురు రాజకీయ నాయకులతో సహా 6,000 మంది అతిథులకు పంపబడుతున్నాయి. ఈ ఆలయానికి 2020 ఆగస్టులో మోదీ శంకుస్థాపన చేశారు. అయితే సాక్షాత్తు ఆ శ్రీరాముడు నడయాడిన నేల.. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించారు.

ఈమేరకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం, రామమందిరం తీర్థక్షేత్ర ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. దేశ విదేశాల నుంచి సుమారు 4 వేల మంది ఈ వేడుకకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈమేరకు ఇప్పటికే ఆహ్వాన పత్రాలు పంపించారు. మొదటి రోజు ప్రజలెవరికీ అనుమతి లేదని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు.

అతిథులకు పంపిన ఆహ్వాన పత్రాన్ని రామమందిరం తీర్థక్షేత్ర ట్రస్టు విడుదల చేసింది. అద్భుతంగా ఉన్న ఈ కార్డును చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి జనవరి 22న అతిథులకు మాత్రమే ఆహ్వానం పంపించారు.

ఈ ఆహ్వాన పత్రంలో ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్, ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహంత్‌ నృత్య గోపాలదాస్‌. ఆహ్వాన పత్రంలో బాల రాముడి చిత్రం ముద్రించారు. ఆహ్వానపత్రంపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రించారు.

ఒక్కసారి మాత్రమే లోపలికి వచ్చేలా దీనిని ఏర్పాటు చేశారు. అతిథి వేదిక నుంచి వెళ్లిన తర్వాత మళ్లీ లోపలికి వచ్చే అవకాశం ఉండదు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker