Health

ఈ కూర తినేటప్పుడు జాగ్రత, సంచలన విషయాలు చెప్పిన ఆరోగ్య నిపుణులు.

బచ్చలి కూరను తినడం ద్వారా శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాబట్టి బచ్చలి కూరను ఆహారంలో భాగంగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బచ్చలికూరలో చాలా పోషకాలు ఉన్నాయి. బచ్చలికూరలో మీ ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో విటమిన్లు ఉంటాయి. ఖనిజాలకు బచ్చలికూర గొప్ప మూలం. అయితే ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది నిజమే కానీ కొన్నింటిని ఎంత వరకూ తీసుకుంటేనే బెటర్. బచ్చలి కూరలో శరీరానికి అవసరం అయిన పోషకాలన్నీ లభ్యమవుతాయి.

అందుకే వైద్యులు కూడా బచ్చలి కూర తీసుకోమని సూచిస్తూ ఉంటారు. ఇంకొంత మంది అయితే వారంలో ఒక్కసారైన ఆకు కూరల్ని యాడ్ చేస్తారు. ఇలా అప్పుడప్పుడు తీసుకుంటే పర్వాలేదు కానీ.. క్రమం తప్పకుండా తీసుకునే వారిలో మాత్రం.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు గుర్తించారు. అయితే బచ్చలి కూరను ఈ మూడు రకాలుగా తీసుకుంటే మాత్రం పలు దుష్ప్రభావాలు వస్తుయన్నాట.

పచ్చి బచ్చలి కూర:-చాలా మంది మంచిది కదా అని పచ్చి బచ్చలి కూరను సలాడ్స్ లో యాడ్ చేసుకుని నేరుగా తింటున్నారు. ఇలా అస్సలు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పచ్చి బచ్చలి కూరను శుభ్రంగా కడిగినా.. దానిపై ఆక్సాలిక్ యాసిడ్స్ అధిక పరిమాణంలో లభ్యమవుతాయి. ఇలా పచ్చిది తీసుకుంటే.. క్యాల్షియం, ఖనిజాలు తగ్గి పోతాయి. దీంతో కిడ్నీలో రాళ్ల సమస్య ఏర్పడుతుంది. బచ్చలి కూరను ఉడికించి తీసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు. అలాగే ప్రతి రోజూ కాకుండా.. అప్పుడప్పుడు తీసుకోవాలని చెబుతున్నారు.

బచ్చలి కూర రసం తాగడం:-పచ్చి బచ్చలి కూర ఆకులతో రసం తయారు చేసుకుని తాగుతూ ఉంటారు. ఎట్టి పరిస్థిత్తుల్లో కూడా పచ్చి బచ్చలి కూర రసాన్ని తాగొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అదే విధంగా పెరు లేదా ఇరత పండ్లతో కూడా కలిపి స్మూతీలా కూడా తయారు చేసుకుని తాగుతారు. ఇలా తాగడం వల్ల కూడా అనేక సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇలా తాగడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు తెలెత్తవచ్చట. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు దూరంగా ఉండటమే మేలు.

పరిమితికి మించి తీసుకోవడం:-మంచిదని చాలా వరకు పరిమితికి మించి తీసేసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల సమస్యలే తప్ప.. ప్రయోజనాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా మితంగా తీసుకుంటేనే అమృతమని అంటున్నారు. ఇలా చేస్తే పొట్ట సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker