Health

ఇక్కడ నొప్పిని లైట్ తీసుకుంటున్నారా.? అది ప్రాణాంతక సమస్య కావొచ్చు.

వెన్నునొప్పిలో ఎక్కువభాగం గుర్తించదగిన కారణాలు లేవు. అనేక రకాల వైద్య సమస్యలకు ఇది ఒక లక్షణంగా భావించాలి. కీళ్ళు బలహీనపడి, కండరాలు, నరాలలో నొప్పిని కలిగిస్తాయి. పిత్తాశయం, క్లోమం, బృహద్ధమని, మూత్రపిండాల వ్యాధి, వాపు కూడా వెనుకభాగంలోని నొప్పికి కారణం కావచ్చు. అయితే మారుతోన్న జీవన శైలి, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే కనిపించే హృదయ సంబంధిత రోగాలు ఇప్పుడు 30 ఏళ్లు కూడా నిండని వారిలో కనిపించడంలో ఆందోళన కలిగిస్తోంది. దీంతో గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఉంటే కొన్ని రకాల లక్షణాల ఆధారంగా గుండెపోటును ముందుగానే గుర్గించవచ్చని నిపుణులు చెబుతుంటారు. సకాలంలో స్పందించి, చికిత్స ప్రారంభిస్తే.. ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు ఛాతీలో నొప్పిని ప్రాథమిక లక్షణంగా భావిస్తుంటాం. అయితే వెన్ను నొప్పి కూడా గుండు పోటుకు ఒక లక్షణమేనని మీకు తెలుసా.? ఇంతకీ గుండె పోటుకు, వెన్న నొప్పికి మధ్య సంబంధం ఏంటనేగా మీ సందేహం. అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.. గుండె ధమనుల్లో రక్త ప్రసరణ అకస్మాత్తుగా ఆగిపోయే పరిస్థితిని గుండెపోటుగా చెబుతుంటారు. ధమనుల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. దీంతో హృదయానికి తగినంత రక్తం అందదు.

ఇలాంటి సమయాల్లోనే శరీరంలోని ఇతర భాగాలలో కూడా ఆక్సిజన్, పోషకాలు సరిగ్గా అందవు. ఈ కారణంగానే గుండెపోటు వచ్చే కంటే ముందు.. వీపు, చేయి, కడుపు, మెడ వంటి భాగాల్లో అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి ప్రారంభమవుతుంది. ఇలా ఉన్నపలంగా భరించలేని నొప్పి వస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. ఇక వెన్ను నొప్పితో పాటు మరికొన్ని లక్షణాల ద్వారా గుండెపోటును ముందుగానే పసిగట్టవచ్చు.

అవేంటంటే.. ఛాతీలో భారంగా అనిపించడం, ఛాతిలో మంటగా ఉండడం వంటి లక్షణాలు గుండెపోటు వచ్చే ముందు కనిపిస్తాయి. అలాగే దీర్ఘకాలంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎలాంటి శారీరక శ్రమ లేకపోయినా, ఆకస్మికంగా చెమటలు పట్టడం, అకస్మాత్తుగా తలతిరగడం వంటి లక్షణాలు కనిపించినా వెంటనే అలర్ట్ అవ్వాలి. ఇక కొందరిలో వాంతులు, వికారం వంటివి కూడా గుండెపోటుకు లక్షణాలు చెప్పొచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker