Health

తాటికల్లు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే షాక్ అవుతారు.

తాటి కల్లు చెట్టు నుండి తీసిన వెంటనే తాగటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అలా కాకుండా ఆలస్యంగా తాగితే అది బాగా పులిసిపోయి ఆల్కహాల్ లాగ మారిపోతుంది.తాటి కల్లులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి, అమైనో ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అయితే తాటి కల్లు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ముఖ్యంగా పల్లెటూర్లలో చాలా మంది తాటి కల్లు తాగుతూ ఉంటారు.

చాలా మంది ఇప్పటికీ తాటి కల్లు తాగుతూ ఉంటారు. వివిధ అనారోగ్య సమస్యలను తగ్గించడానికి కూడా ఈ కల్లు తాగుతారు. తాటి కల్లు తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెబుతూ ఉంటారు. తాటి చెట్టు నుండి కుండలోకి వచ్చిన ద్రావణాన్ని నీరా అంటారు. ఈ నీరా చాలా టేస్టీగా ఉంటుంది. పలు రకాల ఆరోగ్య సమస్యల్ని కూడా తగ్గిస్తుంది.

నీరా తాటి చెట్టు నుంచి తీసిన 12 గంటల్లోనే తీసుకోవాలి. ఆ తర్వాత ఇది విషంగా మారుతుంది. ఇలా సేకరించిన 100 ఎమ్ఎల్ నీరాలో 75 క్యాలరీలు ఉంటాయి. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ కూడా సుక్రోజ్ రూపంలో ఉంటాయి. కాబట్టి దీన్ని షుగర్ ఉన్న వారు తీసుకుంటే.. చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరగవు. పలువురు పోషకాహార నిపుణులు సైతం నీరా తాగడం చాలా మంచిదని చెబుతున్నారు.

ఈ నీరాను వెంటనే తీసుకుంటే మత్తు లేకుండా ఉంటుంది. సమయం గడిచే కొద్దీ కల్లుగా మారుతుంది. దీంతో ఆల్కహాల్ శాతం పెరుగుతుంది. అయితే ఈ కల్లు పులవకుండా ఉండటానికి ఇందులో క్యాల్షియం హైడ్రాక్సైడ్ అనే రసాయన్ని కలుపుతారు. దీంతో కల్లులో ఆల్కహాల్ శాతం మరింత పెరుగుతుంది. ఇలా రసాయనాలు కలిపిన కల్లు తాగడం వల్ల శరీరంపై చెడు ప్రభావం కలుగుతుంది.

ఇలా ఆల్కహాల్ శాతం పెరిగి, మత్తు ఇచ్చే కల్లును తాగడం వల్ల ఎన్నో రకాల దుష్ప్రభావాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోని ఊపిరి తిత్తులు, కాలేయాన్ని, గుండెపై తీవ్ర ప్రభావం చూపించి.. పాడయ్యేందుకు తోడ్పడుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker