Health

నల్లనువ్వులను ఇలా వాడితే పురుషుల‌కు ఓ గొప్ప వరం. బీపీ సమస్య కూడా..?

నువ్వులు ప్రాచీన కాలం నుండి భారతీయ ప్రజల వంటలలో భాగం. నువ్వులు అనేక రంగులలో ఉంటాయి. నలుపు రంగు నువ్వులు కూడా ఎక్కువ ప్రాచుర్యం పొందాయి ఎందుకంటే అవి చాలా పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. అనేక ప్రత్యేక వంటలలో ఉపయోగిస్తారు. దీనితో పాటు నల్ల నువ్వులు మంచి జీర్ణక్రియను నిర్వహిస్తాయి , రక్తపోటులో కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ విధంగా, వారు ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తారు. అయితే నువ్వుల‌ను, దాని నూనెను ఆయుర్వేదంలో విరివిగా ఉప‌యోగిస్తారు.

అయితే నువ్వుల్లో ఇంకో ర‌కం నువ్వులు కూడా ఉంటాయి. సాధార‌ణంగా మ‌నం చూసేవి తెల్ల నువ్వులు. కానీ న‌ల్ల నువ్వులు కూడా ఉంటాయి. వీటితో మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. న‌ల్ల నువ్వుల్లో మ‌న శరీరానికి మేలు చేసే ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరంలో ఉండే కొలెస్ట్రాల్‌, ట్రై గ్లిజ‌రైడ్స్‌ను త‌గ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే అధిక బ‌రువు త‌గ్గుతారు. కొవ్వు క‌రిగిపోతుంది. న‌ల్ల నువ్వుల్లో వృక్ష సంబంధ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. క‌నుక మాంసాహారం తిన‌ని వారు ఈ నువ్వుల‌ను తిన‌డం ద్వారా ప్రోటీన్ల‌ను పుష్క‌లంగా పొంద‌వ‌చ్చు.

ప్రోటీన్లు మ‌న శ‌రీర నిర్మాణానికి కండ‌రాల పెరుగుద‌ల‌కు, శ‌క్తికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. క‌నుక న‌ల్ల నువ్వుల‌ను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. కేవ‌లం 3 టేబుల్ స్పూన్ల న‌ల్ల నువ్వుల‌ను రోజూ తింటే చాలు.. 30 గ్రాముల ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి. న‌ల్ల నువ్వుల్లో కాల్షియం పుష్క‌లంగా ఉంటుంది. అలాగే మెగ్నిషియం, మాంగ‌నీస్, కాప‌ర్‌, జింక్‌, ఫాస్ఫ‌ర‌స్ కూడా స‌మృద్ధిగానే ఉంటాయి. ఇవ‌న్నీ ఎముక‌ల నిర్మాణానికి, ఎముక‌లను బ‌లంగా ఉంచేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి.

దీంతో వృద్ధాప్యంలో వ‌చ్చే ఎముక‌ల సంబంధ‌మైన ఆస్టియోపోరోసిస్‌, ఆర్థ‌రైటిస్ వంటి కీళ్ల స‌మ‌స్య‌లు రాకుండా నిరోధించ‌వ‌చ్చు. న‌ల్ల నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో బి కాంప్లెక్స్ విట‌మిన్ల‌తోపాటు విట‌మిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది చ‌ర్మాన్ని ఆక్సీక‌ర‌ణ డ్యామేజ్ నుంచి ర‌క్షిస్తుంది. అలాగే కొల్లాజెన్ ఉత్ప‌త్తికి స‌హాయ ప‌డుతుంది. దీని వ‌ల్ల చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. న‌ల్ల నువ్వుల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల వీటిని రోజూ తింటే మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

అలాగే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. పేగుల్లో మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీంతో వ్య‌ర్థాలు ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. అలాగే న‌ల్ల నువ్వుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల‌కు ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. ఇవి పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచుతాయి. వీర్యం ఉత్ప‌త్తి చేసేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. క‌నుక వీటిని రోజూ తింటే ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker