Health

ఎప్పుడైనా బ్లూ వైన్ తాగారా..? ఒక్కసారి తాగితే అస్సలు వదలరు.

చాలామందికి వైన్‌ అంటే నచ్చుతుంది. వోడ్కా, స్కాచ్‌ ఇలాంటివి తాగినప్పుడు కిక్‌ బానే ఎక్కుతుంది కానీ.. ఆ ఎఫెక్ట్‌ మరుసటి రోజు వరకూ ఉంటుంది. హ్యాంగోవర్‌ అంత త్వరగా వదలదు. అదే వైన్‌ అయితే కిక్కు ఎక్కుతుంది. కడుపు మంట ఉండదు. ఎలాంటి తలనొప్పి ఉండదు. అన్నింటికంటే హైలెట్‌ వైన్‌ తాగితే..కలర్‌ వస్తారు, హెల్త్‌కు కూడా మంచిది. రెడ్, వైట్ కలర్‌లో ఉండే వైన్ చూస్తూనే ఉంటారు. అయితే బ్లూ వైన్ 2016 నాటిది. స్పానిష్ బృందం వైన్ రంగు మీద ప్రయోగాలు చేయాలని కొన్ని నిబంధనలు ఉల్లంఘించి దీన్ని సృష్టించారు.

యువతరాన్ని ఆకర్షించేందుకు ఈ సంప్రాదాయేతర పానియాన్ని రూపొందించడానికి ప్రయత్నించారు. బ్లూ కలర్ ద్రాక్షతో తయారు చేయడం వల్ల దీనికి ఈ రంగు వచ్చిందని అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ వైన్ రంగు కోసం ఉపయోగించే ద్రాక్ష దగ్గర నుంచి ప్రతీ ఒక్క విషయం ఆశ్చర్యం కలిగించేదే. దీని కోసం తెల్ల ద్రాక్షని ఉపయోగిస్తారు. ఈ ద్రాక్షని ప్రత్యేకమైన మెసేరేషన్ టెక్నిక్ ద్వారా రంగు తెప్పిస్తారు.

ఈ టెక్నిక్ ద్రాక్ష రసాన్ని ఆంథోసైనిన్ అనే ఎర్ర ద్రాక్షతో కలిపారు. దీని వల్ల ఈ వైన్ కి నీలం రంగు వచ్చింది. వైన్ బ్లూ కలర్ రావడంలో ఆంథోసైనిన్ కీలక పాత్ర పోషించింది. మెసేరేషన్ ప్రక్రియలో అన్ని ద్రవాలని ఒకే విధమైన కొలతతో తీసుకున్నారు. అయితే ఈ వైన్ కోసం ఎటువంటి కృత్రిమ రంగులు ఉపయోగించనలేదు. దీనికి వచ్చిన నీలం రంగు పూర్తిగా సహజ వనరుల నుంచి వచ్చిందే. ఆంథోసైనిన్ ప్రభావం.. ఆంథోసైనిన్ వైన్ రుచిపై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది.

ఇది ప్రధానంగా తెల్ల ద్రాక్ష అసలు రుచి, ప్రొఫైల్ ని కలిగి ఉంటుంది. అందుకే ఈ వైన్ రీఫ్రెష్ గా అనిపిస్తుంది. విపరీతమైన పాపులారిటీ.. బ్లూ వైన్ ప్రత్యేకించి మిలినీయల్స్, కొత్తదనం కోరుకునే వైన్ ప్రియుల కోసం చేసింది. పెద్ద పెద్ద పార్టీలో ఇది స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. డిఫరెంట్ స్టైల్ కోరుకునే వాళ్ళు దీన్ని తాగేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. బ్లూ వైన్ ని తరచుగా వైట్ వైన్ లేదా ఫ్రూటీ కాక్టెయిల్ తో పోలుస్తారు. వివాదాలు.. నిబంధనలు ఉల్లంఘించి చేసిన వైన్, విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది.

అందుకే దీని పైన విపరీతమైన వివాదాలు కూడా ఉన్నాయి. సంప్రదాయ వైన్ తో దీనికి ఎటువంటి సంబంధం లేదని కొందరు వాదిస్తారు. ఇది కేవలం మార్కెటింగ్ జిమ్మిక్ గా పరిగణిస్తారు. మరికొందరైతే తెల్ల ద్రాక్షకి ఆంథోసైనిన్ ను జోడించడం అసలు జరిగే పని కాదని అంటారు. దీని మీద ఎన్ని వాదనలు, వివాదాలు ఉన్నప్పటికీ మాత్రం ఇది ఔత్సాహికుల్ని తెగ ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఇది కంటికి ఇంపుగా అనిపించే నీలం రంగుని కలిగి ఉండటమే. మార్కెట్ లో దీనికి డిమాండ్ కూడా బాగుంటుందట.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker