ఒక్క బొగ్గు ముక్కను ఇలా చేసి వాడితే తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది.
తెల్ల జుట్టు, జుట్టు రాలడం వంటి సమస్యలను అనేకమంది ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలవల్ల సులభంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే నేటి ఆధునిక కాలంలో ఆహారపు అలవాట్లు, పోషకాల లోపం, కాలుష్యం, జీవన శైలిలో మార్పులు ఇలా రకరకాల కారణాల వల్ల దాదాపు అందరనీ హెయిర్ ఫాల్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది.
అయితే అలాంటి వారికి బొగ్గు అద్భుతంగా సహాయపడుతుంది. అవును, బొగ్గులో ఉండే కొన్ని శక్తి వంతమైన పోషకాలు హెయిర్ ఫాల్‌కి అడ్డు కట్ట వేసి. జుట్టును నల్లగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. తల స్నానం చేసేటప్పుడు మీరు వాడే షాంపూకు ఒక స్పూన్ బొగ్గు పొడిని కలిపి జుట్టు మొత్తానికి పట్టించాలి. ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆపై బాగా రుద్దుకుంటూ గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మార్పు మీరు ప్రత్యక్షంగా చూస్తారు. బొగ్గుతో చేసే హెయిర్ రెమిడీ జట్టు కుదుళ్లకు మంచి బలాన్నిస్తుంది. తద్వారా జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. జుట్టు నుండి మురికి, ఫంగస్‌ను తొలగించడంలో బొగ్గు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీన్ని ఉపయోగించడం ద్వారా జుట్టును పూర్తిగా శుభ్రంగా ఉంచుకోవచ్చు.
మరో పద్ధతి కోసం.. ఒక గిన్నెలో అర టీస్పూన్ యాక్టివేటెడ్ చార్కోల్ పౌడర్ తీసుకోండి. దానికి 2 చెంచాల అలోవెరా జెల్ వేసి కలపాలి. రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. తర్వాత తలకు బాగా అప్లై చేయాలి. కొంత సమయం తరువాత షాంపూ సహాయంతో తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. కొబ్బరి నూనెను వేడి చేసి దానికి ఒక చెంచా బొగ్గు పొడిని కలపాలి.
ఈ మిశ్రమాన్ని స్టౌవ్ మీద పెట్టి బాగా వేడిచేయాలి. ఆయిల్ చల్లార్చుకుని ఫిల్టర్ చేయండి. ఈ నూనెను వారానికి రెండు సార్లు తలకు పట్టించి బాగా మసాజ్ చేయండి. ఆ తర్వాత షవర్ క్యాప్ ధరించండి. అరగంట తర్వాత షాంపూతో జుట్టును కడగాలి. ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తే జుట్టుపై మంచి ప్రభావం చూపుతుంది. అలాగే జుట్టు రాలడం, చివర్లు చిట్లడం వంటి అనేక సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.