News

చెత్త కుప్పలో దొరికిన పాప, ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరోయిన్ అయ్యింది.

చెత్తబుట్టలో దొరికిన చిన్నారి నేడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సార్ హీరోయిన్ గా రాణిస్తుంది. అంతేకాదు.. ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో సార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. తన అంద చెందాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే బాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ యాక్టర్స్‌లో మిథున్ చక్రవర్తి ఒకరు. ఈ హీరో హిందీ, ఇతర భాషలలో కలిపి 350 చిత్రాలకు పైగా నటించాడు. మిథున్ యోగితా బాలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు పుట్టారు. వారి పేర్లు మిమో, రిమో, నమాషి.

అయితే ఒకరోజు బెంగాలీ వార్తాపత్రికలో హృదయ విదారక వార్తా కథనాన్ని చదివి మిథున్ చక్రవర్తి చెలించిపోయాడు. కోల్‌కతాలోని చెత్త కుప్పలో పసికందును పారేశారని, ఓ వ్యక్తి ఆమెను రక్షించాడనేది ఆ వార్తా కథనం సారాంశం. మిథున్ ఆ బాలిక దీనస్థితిని చూసి ఆమెను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మిథున్, అతని భార్యతో పాటు కుమారులు కూడా ఆ పసికందును కుటుంబంలోకి సంతోషంగా స్వాగతించారు. ఆ దత్త పుత్రికే దిశాని చక్రవర్తి . ఇప్పుడు ఈ యువతే హాలీవుడ్ రేంజ్‌కి ఎదిగింది. దిషాని పెంపుడు తల్లిదండ్రులు, సోదరుల ఆప్యాయత, ప్రేమలతో చాలా గారాబంగా పెరిగింది.

సకల సౌకర్యాలతో ఏ లోటు లేకుండా జీవితం కొనసాగించింది. నటన పట్ల తండ్రికి ఉన్న అభిరుచిని వారసత్వంగా పొందింది. ఆమె చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తిని కనబరిచింది. ప్రాథమిక విద్యను భారతదేశంలో పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌కు వెళ్లింది. ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి నటనలో పట్టభద్రురాలైంది, అక్కడ యాక్టింగ్ స్కిల్స్ మరింత మెరుగుపరుచుకుంది. తండ్రిలా కాకుండా, దిశాని హాలీవుడ్‌లో నటనా వృత్తిని ఎంచుకుంది.

ఆమె ఇప్పటికే ‘గిఫ్ట్’, ‘ది గెస్ట్’ వంటి షార్ట్ ఫిల్మ్స్‌లో అద్భుతమైన యాక్టింగ్‌తో విమర్శకులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది. దిషాని నట ప్రస్థానం హాలీవుడ్ షార్ట్ ఫిల్మ్ ‘గిఫ్ట్ (2017)‘తో ప్రారంభించింది, ఇందులో ఆమె తండ్రి నుంచి రహస్యమైన బహుమతిని పొందే ఓ అమ్మాయి పాత్రను పోషించింది. 2022లో ‘ది గెస్ట్’ పేరుతో మరో షార్ట్ ఫిల్మ్‌లో మెరిసింది. దీనిలో ఆమె అపరిచితుడిని ఇంటికి ఆహ్వానించే యువతి పాత్రను పోషించింది. రెండు షార్ట్ ఫిలిమ్స్ హిట్ అయ్యాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker