Health

నువ్వుల్లా కనిపించే ఈ చియాసీడ్స్‌ బెనిఫిట్స్ తెలిస్తే డాక్టర్లు రాసే టాబ్లెట్లతో పనిలేదు.

చియా గింజలు మెక్సికోలో పుట్టాయి. ఇందులో ఫైబర్,ఒమేగా త్రీ, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. మన శరీరంలో శక్తిని పెంపొందించడానికి ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచి, డయాబెటిస్ రాకుండా చేస్తాయి. అంతే కాకుండా బరువు తగ్గడానికి కూడా చాలాబాగా పనిచేస్తాయి. అయితే చూడటానికి చిన్నగా ఉండే చీయ గింజలు అద్భుతమైన ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

ఇది చూడడానికి కొంచెం సబ్జా గింజలు వలే ఉన్న ఇవి పూర్తిగా భిన్నమైనవి.. ఇది కొంచెం బూడిద రంగు మరియు తెలుపు రంగుల్లో ఉంటాయి. ఈజీగా గింజల్లో ప్రోటీన్స్, విటమిన్ ఏ, బి ,ఈ డీలతో పాటు మాంగని, ఫాస్పరస్, క్యాల్షియం, జింక్ ,కాపర్, పొటాషియం, సల్ఫర్, నియాసిన్, లాంటి ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ ను కలిగి ఉన్నాయి.చీయా గింజల్లో ఫైబర్ అధిక మొత్తంలో లభిస్తుంది. రెండు టీ స్పూన్ల చియా గింజల్లో 10 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది.

ఇవి ఉదయం పూట ఒక గ్లాసు నీటిలో కలుపుకొని తాగినట్లయితే ఇది శరీరంలోని కొలెస్ట్రాలను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని తో పాటు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే పెద్దపేగు ఆరోగ్యానికి సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. మాంగనీస్ సమృద్ధిగా లభిస్తుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు అధిగ రక్తపోటు సమస్యను తగ్గించడంలో ఎంతో దోహదపడతాయి. అలాగే ఆరోగ్యవంతమైన బరువు పెరిగేందుకు ఇది ఎంతగానో సాయపడతాయి.

ఈ గింజలలో ఫైబర్ మరియు ప్రోటీన్స్ అధికంగా లభిస్తాయి. వీటిని తినటం వలన పొట్ట నిండినట్లుగా ఉంటుంది. అందువల్ల అధిక బరువు మరియు స్థూలకాయ్ సమస్యలతో బాధపడే వారికి ఇది ఒక చక్కని ఫలితాన్ని ఇస్తుంది. క్యాన్సర్ ను క్రమబద్ధీకరించడంలో గ్రేట్ గా సాయపడతాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

ఇవి ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి. అలాగే రక్తం లో ఇన్సులిన్ అసాధారణం స్థాయిలను నియంత్రిస్తాయి. అలాగే వీటిలో సమృద్ధిగా లభించే కాల్షియం మీ ఎముకలు, దంతాలను బలంగా ఉంచుతుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మా మరియు జుట్టును ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఉపయోగపడతాయి. అలాగే దీనిలో ఉండే పోషకాలు ఆకలి, నిద్ర, మాసిక స్థితిని మెరుగుపరుస్తాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker