Health

పొరపాటున చూయింగ్ గమ్ మింగేస్తే వెంటనే ఏం చెయ్యాలో తెలుసుకోండి.

మనం చిన్నప్పటి నుంచి చూయింగ్ గమ్ మింగేస్తే అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని ఎన్నో కథనాలు వినే ఉంటాం. ఈ విషయమై ఎన్నో రకాల అపోహలు ప్రజలలో ఉన్నాయి. అయితే ఎంతోమంది చూయింగ్ గమ్ మింగేసి చాలా భయపడుతూ ఉంటారు. అది పేగులకు చుట్టుకుపోయి అక్కడే ఉండిపోతుందని అంటారు. కొంతమంది అయితే ఏడేళ్ల వరకు చూయింగ్ గమ్ బయటకు రాదని పొట్టలోనే ఉంటుందని చెబుతారు. నిజానికి అవన్నీ అపోహలే.

చూయింగ్ గమ్ పొరపాటున మింగేస్తే భయపడకండి. మన శరీరం జీర్ణించుకోలేదు. పేగులకు కూడా అది అంటుకోదు. మన పొట్టలో అరగని పదార్థాలు అన్నీ కూడా పేగుల ద్వారా బయటికి వెళ్లిపోతాయి. చూయింగ్ గమ్ అరిగించే శక్తి కూడా మన శరీరానికి లేదు. కాబట్టి అది పేగుల ద్వారా బయటికి వచ్చేస్తుంది. అయితే చూయింగ్ గమ్ బయటికి రావడానికి కనీసం 12 నుంచి 48 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. పొరపాటున మింగితే నీళ్లు అధికంగా తాగండి.

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. ఇలా చేయడం వల్ల చూయింగ్ గమ్ బయటికి వేగంగా మలవిసర్జన ద్వారా వచ్చేసే అవకాశం ఉంది. చూయింగ్ గమ్ నమలడం వల్ల హాని లేదా? అని ఎవరైనా అడగవచ్చు. చాలా అరుదైన పరిస్థితుల్లో మాత్రమే చూయింగ్ గమ్ వల్ల ఇబ్బందులు వస్తాయి. సాధారణంగా అయితే చూయింగ్ గమ్ బయటికి వచ్చేస్తుంది. అలా రాకుండా లోపలే ఉండిపోతే పేగులకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది.

వాంతులు, కడుపునొప్పి, మలబద్ధకం, విరేచనాలు వంటివి అవుతాయి. ఇది తిన్నాక మీకు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోండి. చూయింగ్ గమ్ రెండూ మూడు ఒకేసారి నోట్లో వేసుకోవడం వంటివి చేయకండి. చూయింగ్ గమ్ చరిత్ర ఈనాటిది కాదు. 1866లో మెక్సికో దేశపు సైనిక నియంత సాంటా అన్నా దీన్ని కనిపెట్టినట్టు చెబుతారు.

అతను మెక్సికోలో అంతర్యుద్ధం జరిగినప్పుడు తెల్లటి జిగురు పదార్థాన్ని తీసుకుని అడవుల్లోకి వెళ్లిపోయారు. ఆ జిగురు పదార్థాన్ని నములుతూ ఉన్నాడు. చెట్టు బెరడు నుంచి వచ్చే జిగురు పదార్థాన్ని అక్కడి సైనికులు తింటూ ఉండేవారు. థామస్ ఆడమ్స్ అనే శాస్త్రవేత్త ఆ జిగురు ముక్కతో పంచదార బిళ్లలాంటివి తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker