Health

గుడ్డు ఎక్కువగా తింటే జీవితంలో గుండె జబ్బులు రావా..?

ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు ఒక గుడ్డు తినాలి అంటారు నిపుణులు. ఇందులో విటమిన్స్, సెలీనియం, క్యాల్షియం, జింక్ మరియు ఇతర పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రోటీన్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. కోడిగుడ్డులో గుడ్లలో ఆరు అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. జుట్టుకి, గోళ్ళకి ఇది చాలా మేలు చేస్తాయి. అలాగే విటమిన్-డి కూడా ఎక్కువగా ఉంటుంది. అలానే క్రమం తప్పకుండా గుడ్లను తీసుకోవడం వల్ల ఎముకలు దృడంగా ఉంటాయి. రోజు రెండు ఉడికించిన గుడ్లు తీసుకుంటే మెదడు ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. అయితే మనకు లభించే పౌష్టికాహారాలలో గుడ్లు కూడా ఉన్నాయి.

ఇందులో ఉండే ప్రొటీన్లతో ఇవి మనకు ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్య పరిరక్షణలో గుడ్ల పాత్ర ఎంతో ఉంది. వారానికి మనం ఎన్ని గుడ్లు తినాలి. గుండె పనితీరు ఎలా ఉంటుంది? అనే విషయాలపై చర్చిస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తాయి. చాలా మంది పరిశోధకులు గుడ్లు ఆరోగ్యానికి ఎంో మేలు చేస్తాయని చెబుతున్నారు. గుడ్లను ఉడకబెట్టుకుని తినొచ్చు. ఫ్రై చేసుకుని కూడా తినేందుకు అవకాశం ఉంటుంది. ఎలా తిన్నా గుడ్డుతో మనకు ఆరోగ్యం కలిగిస్తాయని నమ్ముతుంటారు. గుడ్డులో ఉండే విటమిన్లు మన దేహానికి బలాన్ని చేకూరుస్తాయనడంలో సందేహం లేదు.

వారంలో మనం ఎన్ని గుడ్లు తినొచ్చు. మనం తినే గుడ్ల విషయంలో లెక్కలపై పరిశోధకులు ఎన్నో రకాల పరిశోధనలు నిర్వహించారు. వారానికి ఐదు అంతకంటే ఎక్కువ గుడ్లు తినే వారిలో రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్ ) కంట్రోల్ లో ఉన్నట్లు తేలింది. దీంతో గుడ్లు తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు అందుతాయని చెబుతున్నారు. ప్రతి రోజు మనం ఒకటి లేదా రెండు గుడ్లు తినొచ్చు. దీని వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. గుడ్డులోని తెల్లసొన మాత్రమే తిని పచ్చసొనను తినకూడదని సూచిస్తున్నారు.

గుడ్లలో పోషకాలు.. గుడ్లలో పోషకాలు, ప్రొటీన్లు ఉన్నాయి. వీటితో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. వీటిని తినడం వల్ల గుండెకు మంచిది కాదని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జరిపిన పరిశోధనలో బయటపడిందని చెబుతున్నారు. ఒక గుడ్డు దాదాపు 6 గ్రాముల ప్రొటీన్లు కలిగి ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఎన్ని కిలోల బరువు ఉంటే అన్ని గ్రాముల ప్రొటీన్ అవసరం. ఉదాహరణకు అరవై కిలోలు ఉన్న వ్యక్తికి రోజుకు 40 నుంచి 60 గ్రాముల ప్రొటీన్ తీసుకోవడం మంచిది.

రోజుకో గుడ్డు తింటే.. రోజుకో గుడ్డు తింటే వ్యాధుల నుంచి దూరం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. దీంతో రోజువారీ ఆహారంలో దీన్ని భాగంగా చేసుకోవడం మంచిది. రోగాల బారిన పడకుండా ఉండాలంటే గుడ్డు ను రోజు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. గుండె జబ్బులు ఉన్న వారు సైతం గుడ్డును ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి జరుగుతుందని పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలో గుడ్డు పౌష్టికాహారంగానే గుర్తించాలి. దీంతో మనకు అనుకూల అంశాలే ఎక్కువగా ఉండటంతో గుడ్డు తినడం మంచిదే.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker