Health

ఒక గ్లాస్ వేడి పాలలో చిటికెడు ఈ పొడిని వేసి తాగితే జీవితంలో చక్కెర వ్యాధి రాదు.

రక్తంలో చక్కెర పెరగడం.. తగ్గడం రెండూ మీకు హానికరం, ముఖ్యంగా చలికాలంలో. చలికాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి, రక్తంలో చక్కెర స్థాయిపై ప్రత్యక్ష ప్రభావం చూపే పదార్థాలను మనకు తెలియకుండానే తీసుకుంటాం. సాధారణంగా ఈ రోజుల్లో చాలా మంది అన్నం తినడం మానేస్తారు. కానీ, ఒక్క అన్నం మాత్రమే రక్తంలో చక్కెర స్థాయికి పెరగడం కారణం కాదు. చాలా ఆహార పదార్ధాలు రక్తంలో చక్కర స్థాయిని పెంచుతాయి. అయితే చలికాలంలో ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి.

ముఖ్యంగా ఆహారం విషయంలో. మధుమేహులు ఏవి పడితే అవి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. అందులోనూ ఈ సీజన్ లో చాలా మంది వ్యాయామం చేయరు. శారీరక శ్రమ తగ్గడంతో జీవక్రియ నెమ్మదిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయి మరింత ప్రభావితమవుతుంది. అయితే కొన్ని సహజ మూలికలు, సుగంధ ద్రవ్యాలు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. ధనియాలు.. ధనియాలు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి.

అలాగే కార్భోహైడ్రేట్ జీవక్రియను మెరుగుపర్చడానికి, హైపోగ్లైసీమిక్ చర్యను పెంచడానికి సహాయపడుతుందని ఎన్నో అధ్యయనాలు కనుగొన్నాయి. ఈ ధనియాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా ఉండేందుకు సహాయపడతాయి. ధనియాలు జీర్ణక్రియను కూడా పెరుగుపరుస్తాయి. అలాగే చక్కెర సరైన శోషణను ప్రోత్సహిస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గుతాయి. ఈ గింజల్లో ఇథనాల్ పుష్కలంగా ఉంటుంది. ఇది గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి సహాయడుతుంది.

మెంతులు.. ఇంటర్నేషనల్ జర్నల్ ఫర్ విటమిన్ అండ్ న్యూట్రిషన్ రీసెర్చ్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. వేడి నీళ్లలో నానబెట్టిన 10 గ్రాముల మెంతులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. ఈ మెంతుల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. కార్భోహైడ్రేట్లు, చక్కెర శోషణను ఫైబర్ మరింత నియంత్రిస్తుంది.

మెంతులను ఎలా ఉపయోగించాలి.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిద్రపోయే ముందు లేదా ఉదయం మెంతులు నానబెట్టిన నీటిని తీసుకోవాలి. ఒకవేళ మీరు ఉదయం మెంతి వాటర్ ను తాగాలనుకుంటే పడుకునే ముందు ఈ గింజలను నానబెట్టండి. దాల్చిన చెక్క..డయాబెటీస్ కేర్ లో ప్రచురించిన పరిశోధనల ప్రకారం.. టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

దాల్చిన చెక్క పెరిగిన రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఇన్సులిన్-మైమెటిక్, ఇన్సులిన్ -సెన్సిటైజింగ్ చర్యను కలిగి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ మరొక అధ్యయనం ప్రకారం.. దాల్చిన చెక్కను సరైన మోతాదులో తీసుకుంటే.. రక్తంలో గ్లూకోజ్ 18 నుంచి 29 శాతం తగ్గుతుంది. టైప్ 2 డయాబెటీస్ తో సంబంధం ఉన్న అనారోగ్య నమస్యల ముప్పు కూడా తగ్గుతుంది. దాల్చిన చెక్కను ఎలా ఉపయోగించాలి.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దాల్చిన చెక్కను పాలలో కలిపి తీసుకోవాలి. ఇందుకోసం ఒక గ్లాస్ వేడి పాలలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని వేసి తాగాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker