Health

ఈ లడ్డూలు ఇంట్లో ఈజీగా చేసుకొని రోజు ఒకటి తింటే చాలు, రుచితో పాటు పూర్తీ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.

ప్రోటీన్ హెల్దీ లడ్డూ ల‌డ్డూను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ ల‌డ్డూల‌ను తినడం వ‌ల్ల ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. ఎముకలు ధృడంగా త‌యార‌వుతాయి. శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. ఈ ల‌డ్డూల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారని చెప్ప‌వ‌చ్చు. అయితే ప్రోటీన్ హెల్దీ లడ్డూ.. చాలా మంది వివిధ రకాలుగా లడ్డూలను తయారు చేస్తూంటారు.

కానీ రాగి పిండితో తయారు చేసే ఈ ప్రోటీన్ లడ్డూలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చిన్న వారైనా, పెద్దవారైనా వీటిని తినడం వల్ల ఎముకలు స్ట్రాంగ్ గా అవ్వడమే కాకుండా.. రక్త హీనత సమస్య కూడా తగ్గుతుంది. ఈ లడ్డూలతో రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే ఈ ప్రోటీన్ లడ్డూలను..

ఎలా తయారు చేసుకుంటారు? కావాల్సిన పదార్థాలు ఏంటి? ప్రోటీన్ లడ్డూ తయారీ విధానం:- ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో మీకు సరిపడినంత క్వాంటిటీ రాగి పిండి వేసి చిన్న మంటపై ఓ పది నిమిషాల పాటు వేయించు కోవాలి. ఆ తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి.

నెక్ట్స్ అదే కడాయిలో పల్లీలు వేసి.. వేయించి పక్కకు ప్లేట్ లోకి తీసుకోవాలి. దీన్ని మిక్సీలో బరకగా అయ్యేలా వేసుకుని ఒక బౌల్ లోకి తీసి పక్కకు పెట్టు కోవాలి. ఆ తర్వాత ఉప్పు, యాలకుల పొడిని కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకూ మిక్సీ పట్టు కోవాలి. తర్వాత గిన్నెలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. ఇది లేత తీగ పాకం వచ్చేలా తీసుకోవాలి. ఇందులో రాగి పిండి వేసి.. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.

ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారు బెట్టుకోవాలి. ఈ రాగి పిండి మిశ్రమం గోరు వెచ్చగా ఉన్నప్పుడు చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. కావాలంటే వీటిల్లో జీడి పప్పు పౌడర్ కూడా వేసుకోవచ్చు. అంతే ఎంతో ఈజీ అండ్ హెల్దీ ప్రోటీన్ లడ్డూ తయారవుతుంది. పిల్లలకు రోజూ ఒక ఉండను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల ఉంటుంది. అంతే కాకుండా రక్త హీనత వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker