Health

ఉదయాన్నే టిఫిన్‌గా ఉప్మా తింటున్నారా..? అయితే మీ కోసమే ఈ విషయాలు.

ప్రతి వయస్సు వారికి ఆరోగ్యకరమైన ఎంపిక. ఉప్మా మీ పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.ఉప్మాను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. స‌రైన విధానంలో త‌యారు చేసుకుంటే ఉప్మా కూడా చాలా రుచిగా ఉంటుంది. అయితే చాలా ఇళ్లలో ఉదయాన్నే పిల్లల కోసం త్వరగా అవుతుందని టిఫిన్ చేస్తారు తల్లులు. అయితే ఆ టిఫిన్‌ని పిల్లలు మాత్రం తినడానికి ఇష్టపడరు. అయినప్పటికి తల్లులు దాన్ని తయారు చేయడం మానరు.

కారణం ఏమిటంటే తన పిల్లలకు ఏమి ఇవ్వాలో ఆ తల్లులకు బాగా తెలుసు కాబట్టి ఆ టిఫిన్‌నే తయారు చేస్తుంటారు. ఉప్మా అనే టిఫిన్‌ను రవ్వతో పాటు అనేక కూరగాయలతో తయారుచేస్తారు. ఉప్పులో కాలానుగుణ కూరగాయలను జోడించడం ద్వారా మీరు ఉప్మాలో సీజన్‌కు అవసరమైన ప్రోటీన్‌ను పొందుతారు. కొందరికి ఉదయం పూట ఉప్మా పేరు చెబితే చాలు దాని వాసన నోరూరిస్తుంది.

అదే ఉప్మాను ఇష్టపడని వారు 4-5 గంటలు ఏమి తినకుండా అయినా ఉంటారు కాని..ఉప్మానుమ మాత్రం ముట్టుకోరు. ఉప్మా తినడం వల్ల గుండె, మూత్రపిండాలతో పాటు ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఉప్మా శరీరంలోని ఈ మూడు భాగాలకు శక్తిని అందిస్తుంది. ఉప్మాలో ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది తినడం వల్ల మీ ఆరోగ్యాన్ని దీర్ఘకాలం పదిలంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఉప్మా తయారీలో శనగలు, వేరు శనగలు సహా అనేక ధాన్యాలు ఉపయోగిస్తారు. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉప్మా వేడెక్కించే పదార్ధం. చలికాలంలో చిరుతిండికి మంచి ఎంపిక. అందుకే చలికాలంలో శరీరాన్ని జలుబు సంబంధిత వ్యాధుల నుంచి రక్షించడంలో ఉప్మా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఉప్మా తింటే ఆకలిని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే అల్పాహారంగా ఉప్మాను తినడానికి ప్రాధాన్యత ఇవ్వొచ్చు.

ఉప్మాలో ఉండే అధిక కూరగాయలు, ధాన్యపు చిరుతిండి. ఇందులో సుగంధ ద్రవ్యాలు చాలా అరుదుగా ఉపయోగించబడతాయి. కాబట్టి ఉప్మాను తినడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker