Health

ఫిష్ స్పా చేయించుకుంటున్నారా..? జాగ్రత్త. ఫిష్ స్పా వల్ల కాళ్ల వేళ్లను కోల్పోయిన మహిళ.

చిన్న చిన్న చేపలతో ఉండే ట్యాంకులో కాళ్లు పెట్టి.. పెడిక్యూర్ చికిత్స పొందుతున్నారా? అయితే, తప్పకుండా ఈ మహిళకు ఎదురైన చేదు అనుభవం గురించి తెలుసుకోవల్సిందే. కాళ్ల మీద ఉండే డెడ్ స్కిన్‌ను తొలగించేందుకు చాలామంది ఫిష్ పెడిక్యూర్ స్పాలకు వెళ్తుంటారు. అయితే, దీనివల్ల ఆరోగ్యానికి జరిగే మేలు కంటే.. నష్టమే ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ రోజుల్లో అందంగా కనిపించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో ఫిష్ స్పా కూడా ఒకటి. దీనికి లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు.

మాల్స్ నుంచి స్పా సెంటర్ల వరకు అన్ని చోట్లా ఫిష్ స్పాలు అందుబాటులో ఉన్నాయి. ఫిష్ పెడిక్యూర్ అనేది మానసికంగా విశ్రాంతికి సహాయపడే ఒక రకమైన మసాజ్. అయితే జీ న్యూస్ రిపోర్ట్ ప్రకారం ఫిష్ స్పా చేయడం వల్ల అనేక తీవ్రమైన వ్యాధులు వస్తాయని మీకు తెలుసా..? మీరు ఫిష్ స్పా చేస్తే ఏదైనా ప్రాణాంతక వ్యాధి ఉన్న వ్యక్తులకు ఫిష్ స్పా చేస్తే ఆరోగ్యకరంగా ఉండే వ్యక్తికి అదే చేపలతో స్పా చేయించడం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం లేకపోలేదు.

స్కిన్ ఇన్ఫెక్షన్ సమస్య: ఫిష్ స్పా చేయించుకోవడం వల్ల మీరు స్కిన్ ఇన్ఫెక్షన్ సమస్యను గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ట్యాంక్‌లో ఉండే చేపలు అనేక వ్యాధుల బారిన పడతాయి. బ్యాక్టీరియా మీ వద్దకు చేరితే, మీరు ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ప్రతి నెలా ఫిష్ స్పా చేస్తుంటే, జాగ్రత్తగా ఉండండి. స్కిన్ టోన్ అధ్వానంగా మారుతుంది: ఫిష్ స్పా మీ స్కిన్ టోన్ మరింత దిగజారడానికి పనిచేస్తుంది. కాబట్టి, మీరు ఫిష్ స్పా చేస్తే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇది మీ చర్మాన్ని డల్ గా , రఫ్ గా మార్చుతుంది.

నెయిల్ డ్యామేజ్ సమస్య: ఫిష్ స్పా సమయంలో గోర్లు పాడవుతాయి. స్పా సమయంలో చేపలు మీ గోళ్లను కొరుకడమే దీనికి కారణం. ఇది మీ గోర్లు దెబ్బతినడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఫిష్ స్పా చేయడం మానుకోండి.. థాయ్‌‌ల్యాండ్ పర్యాటకుల కోసం అక్కడ ఎన్నో ఫిష్ పెడిక్యూర్ స్పాలు వెలిశాయి. మీ కాళ్లు అందంగా కనిపించాలంటే.. చేపలతో డెడ్‌స్కిన్ తొలగించుకోండి అంటూ ఆమెను స్పా నిర్వాహకులు ఆహ్వానించారు. దీంతో ఆమె చేపల తొట్టెలో కాళ్లు పెట్టి కాసేపు ఎంజాయ్ చేసింది.

అయితే, కొద్ది రోజుల తర్వాత తీవ్రమైన జ్వరానికి గురైంది. వైద్యులను సంప్రదించగా.. ఆమె కాలి బొటన వేలుకి ఇన్ఫెక్షన్‌ సోకినట్లు తెలిపారు. ఆ చేపల తొట్టెల్లో కలుషిత నీరు ఉంటుందని, కాళ్లకు గాయాలు ఉన్నట్లయితే ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయని వైద్యులు ఆమెకు తెలిపారు. ఆమె బొటన వేలుకు బోన్ ఇన్ఫెక్షన్ ఏర్పడినట్లు గుర్తించారు. రెండేళ్ల తర్వాత ఇన్ఫెక్షన్ పెరిగిపోయింది. అది మిగతా వేళ్లకు సోకకుండా ఉండేందుకు వైద్యులు బొటన వేలు తొలగించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker