Health

కీళ్ల వాతానికి మందులు వాడుతున్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన శాస్త్రవేత్తలు, ఎందుకో తెలుసా..?

కీళ్ల వాతంతో బాధపడేవారు కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు అని చెబుతున్నారు. కీళ్ల వాతంతో బాధపడేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలని అంటున్నారు . మాంసాహారం కీళ్లవాతాన్ని పెంచుతుందని, కనుక మాంసాహారాన్ని బాగా తగ్గిస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. అయితే కీళ్లవాతం వస్తే కీళ్లు పట్టేసినట్లు ఉంటాయి. నొప్పి వేధిస్తుంది. దీన్ని శాశ్వతంగా నయం చేయలేరు కానీ వ్యాధి ప్రభావాన్ని కొన్ని రకాల మందులతో తగ్గించవచ్చు.

అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్(RA)తో బాధపడుతున్న రోగులలో హషిమోటోస్ వ్యాధి, గ్రేవ్స్ వ్యాధి వంటి ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధుల ప్రమాదాన్ని నిపుణులు గుర్తించారు. జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ఇటీవల పబ్లిష్‌ అయిన అధ్యయనం.. RA చికిత్సకు సాధారణంగా ఉపయోగించే యాంటీ-రుమాటిక్ మందులు, ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధులకు సంబంధించిన లక్షణాలను కూడా తగ్గిస్తాయనని తేల్చింది. ప్రస్తుతం ఈ ఇమ్యునో మాడ్యులేటరీ మందులు సాధారణంగా RA రోగులకు చికిత్స చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. అయితే ఈ అధ్యయనం ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ సమస్యలకు చికిత్స చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చని తేలింది.

RA ఉన్న రోగుల కీళ్లలో వాపును తగ్గించే ఈ మందులు ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ అనారోగ్యం వచ్చే అవకాశాలను కూడా తగ్గించడంలో సహాయపడతాయో లేదో తెలుసుకోవడంపై ఈ అధ్యయనం ప్రధానంగా దృష్టి సారించింది. అధ్యయన వివరాలు..ఈ అధ్యయనంలో పరిశోధకులు, 2006 నుంచి 2018 మధ్య కీళ్ల వాతంతో బాధపడుతున్న 13,000 మంది రోగులు, వారి చికిత్సలను పరిశీలించారు. అదనంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేని మ్చాచ్డ్‌ కంట్రోల్‌ గ్రూప్‌ నుంచి 63,000 మంది వ్యక్తుల డేటాను కూడా పరిశోధకులు సేకరించారు. సానుకూల ఫలితాలు.. ఈ చికిత్స తర్వాత, RA రోగుల్లో ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ అనారోగ్యంతో బాధపడే అవకాశాలు మునుపటి కంటే తగ్గాయని పరిశోధకులు కనుగొన్నారు.

‘బయోలాజిక్ DMARDs’గా పేర్కొనే ఇమ్యునో మాడ్యులేటర్లతో చికిత్స పొందిన వారు ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధిని ఎదుర్కొనే రిస్క్ చాలా వరకు తగ్గాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేని కంట్రోల్డ్ గ్రూప్‌లోని రోగులతో పోలిస్తే ఈ రోగులలో ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ అనారోగ్యం అభివృద్ధి చెందే సంభావ్యత 46 శాతానికి తగ్గింది. భవిష్యత్తు పరిశోధనలు.. ఈ ఫలితాలు ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధిపై కొన్ని ఇమ్యునో మాడ్యులేటరీ మెడిసిన్ ప్రభావాన్ని సూచిస్తున్నప్పటికీ, చికిత్స ప్రమాదాన్ని తగ్గిస్తుందని కచ్చితంగా నిర్ధారించలేదని స్టడీ ఆథర్‌ నొక్కిచెప్పారు.

అయినప్పటికీ, కనుగొన్నవి క్లినికల్ ట్రయల్స్ ద్వారా మరింత అన్వేషణకు అవకాశాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు ఉపయోగించే మెడిసిన్‌ను ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధికి ముందస్తు చికిత్స కోసం పునర్నిర్మించవచ్చో లేదో పరిశోధిస్తూ, ‘డ్రగ్ రీపర్పోసింగ్’ సంభావ్యతను ఆథర్‌ హైలైట్ చేశారు. కీళ్లవాతం ఎవరికి వస్తుంది.. రుమటాయిడ్ ఆర్థరైటిస్ (RA) లేదా కీళ్లవాతం అనేది క్రానిక ఆటోఇమ్యూన్‌ డిసీజ్‌. ఇది కీళ్లలో వాపు, నొప్పిని కలిగిస్తుంది. బాధితుల కీళ్లు బిగుసుకుపోయినట్లు ఉంటాయి. ఈ వ్యాధి చర్మం, కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె వంటి శరీరంలోని ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేస్తుంది.

శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ కీళ్లలోని ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేసి వాపును కలిగిస్తుంది. నిర్దిష్ట జన్యువులు ఉన్నవారిలో RA సర్వసాధారణంగా కనిపిస్తుంది. ధూమపానం కూడా ఈ వ్యాధికి ప్రధాన ప్రమాద కారకం. 30 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులకు కీళ్లవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ. పురుషుల కంటే స్త్రీలకు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. కొన్ని రసాయనాలు లేదా ఇన్ఫెక్షన్‌లకు గురైన వ్యక్తులకు కూడా కీళ్లవాతం రావచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker