Health

పారిజాతపూవులను ఉదయానే తీసుకుంటే.. మధుమేహం నుంచి కీళ్ల నొప్పుల వరకు అన్ని రోగాలు తగ్గిస్తుంది.

మనం దేవుడికి పూజ చేసే సమయంలో చెట్టుపై ఉన్న పుష్పాలను కోసి దేవుడికి పూజ చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుందని భావిస్తాము. కానీ పారిజాత పుష్పాలను పొరపాటున కూడా చెట్టు పై నుంచి కోసి దేవుడికి పెట్టకూడదు. ఎప్పుడూ కూడా నేలరాలిన పుష్పాలను తీసుకుని దేవునికి సమర్పించాలి.అలా ఎందుకు చేయాలి అంటే పారిజాత వృక్షం స్వర్గ లోకం నుంచి భూ లోకంలోకి వచ్చింది కనుక ఆ చెట్టు నుంచి కోసిన పువ్వులు నేలను తాకినప్పుడు అవి పవిత్రమవుతాయి. అందుకే నేల పై రాలిన పుష్పాలను మాత్రమే స్వామికి సమర్పించాలి. అయితే చిన్న నారింజ కాడలు, తెల్లటి రేకులతో పారిజాత పువ్వులు చూడడానికి అందంగా ఉంటాయి.

పుష్పించని పువ్వులు ఇతర పువ్వుల మాదిరిగా కొమ్మకు అతుక్కోకుండా, రాలిపోతాయి. పూజకు సాధారణంగా ఉపయోగించే పారిజాత పువ్వు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. పారిజాత మొక్క, పువ్వులు దీర్ఘకాలిక జ్వరం, రుమాటిక్ ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా నుండి ఉపశమనం కలిగిస్తాయి. పౌరాణిక కథనాల ప్రకారం శ్రీకృష్ణుడు పారిజాతాన్ని భూమిపైకి తెచ్చాడని కూడా చెబుతారు. దీనికి నైట్ జాస్మిన్ అని మరో పేరు కూడా ఉంది. ఈ పువ్వులు రాత్రిపూట అందంగా వికసిస్తాయి ,పగటిపూట రాలిపోతాయి.

కీళ్ల నొప్పులు:- పారిజాత మొక్క బెరడు, పూలు, ఆకులు వేళ్ల కీళ్లు, చేతి కీళ్లు, భుజం ఇలా అన్ని కీళ్ల నొప్పులకు ఉపయోగపడతాయని డాక్టర్ దీక్షా బావసర్ చెప్పారు. ఐదు గ్రాముల పారిజాత పువ్వులు లేదా ఆకులను తీసుకుని 200 గ్రాముల నీటిలో బాగా మరిగించాలి. ఆ తర్వాత వడగట్టి చల్లార్చి ఆ నీటిని తాగితే కీళ్ల నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. దీర్ఘకాలిక జ్వరం:- చాలా రోజులుగా నిరంతర జ్వరం లేదా తరచుగా జ్వరంతో బాధపడేవారికి, పారిజాత చెట్టు బెరడు ఉపయోగించి కషాయాలను తయారు చేయవచ్చు.

మూడు గ్రాముల పారిజాత బెరడు లేదా రెండు గ్రాముల పారిజాత ఆకులను నీటిలో వేసి మరిగించి అందులో రెండు లేదా మూడు తులసి ఆకులను వేసి వడకట్టి రోజుకు రెండు పూటలా తాగితే దీర్ఘకాలిక జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది. చక్కెర స్థాయిని తగ్గిస్తుంది:- మధుమేహ రోగులు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి పారిజాత ఆకును ఉపయోగించవచ్చు. పారిజాతంలో మధుమేహాన్ని నియంత్రించే యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. పారిజాత ఆకులను గ్రైండ్ చేసి నీళ్లలో వేసి కాస్త వేడి చేసి ఉదయం పరగడుపున తాగితే షుగర్ లెవల్స్ తగ్గి అదుపులో ఉంటాయి. సయాటికా పెయిన్ రిలీఫ్:- సయాటికా అనేది తుంటి నుండి పాదం వరకు నడిచే నరాల వాపు.

నొప్పి, అసౌకర్యం చాలా తీవ్రంగా ఉంటుంది, రోజువారీ కార్యకలాపాలు కూడా చేయలేవు. దీని నుంచి ఉపశమనం పొందాలంటే 3-4 పారిజాత ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి, చల్లారిన తర్వాత ఖాళీ కడుపుతో తాగాలి. ఇది దీర్ఘకాలిక సయాటికా నుండి ఉపశమనాన్ని కూడా అందిస్తుంది. జలుబు, దగ్గు: తీవ్రమైన జలుబు లేదా దగ్గుతో బాధపడేవారు పారిజాత ఆకులను ఉపయోగించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. పారిజాత ఆకులను గ్రైండ్ చేసి నీటిలో వేసి బాగా మరిగించాలి. దీనికి కొద్దిగా అల్లం , ఒక చెంచా తేనె కలపండి. దీన్ని తాగడం వల్ల జలుబు, దగ్గు నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker