Health

ట్రయల్ రూమ్, హోటల్ గది రహస్య కెమెరాను ఎలా గుర్తించాలో తెలుసుకోండి.

మీరు రహస్య కెమెరాలు ఉన్న ప్రాంతంలో ఉన్నారని మీరు అనుకుంటే, మీ పరిసరాలను పూర్తిగా భౌతిక శోధనను పూర్తి చేయడం మంచి ప్రారంభ స్థానం. గదిని స్కాన్ చేస్తున్నప్పుడు, అసాధారణంగా కనిపించే ఏవైనా వస్తువులను గమనించండి. ఇది మీరు ఇంతకు ముందు ఉన్న ప్రాంతం అయితే, ఏదైనా తరలించబడినట్లు లేదా తిరిగి అమర్చబడినట్లు కనిపిస్తుందో లేదో తనిఖీ చేసి చూడండి. అయితే హోటల్ లేదా షాపింగ్ మాల్ లేదా బట్టల దుకాణం ట్రయల్ రూమ్‌లో రహస్య కెమెరా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?

ఈ ప్రదేశాలన్నింటిలో రహస్య కెమెరాలు ఉండవచ్చని మనం నిర్ధారణకు రాలేము! ఈ క్రమంలో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి. మనం అప్రమత్తంగా లేకపోతే.. మన ప్రైవసీ భంగం కలగవచ్చు.. మీకు తెలియకుండానే అక్కడ దాగి ఉన్న కెమెరా బంధించవచ్చు. మొదట ట్రయల్ రూమ్‌లోకి ప్రవేశించి వెంటనే అక్కడి పరిసరాలను బాగా చూడండి.. ఏమైన అనుమానస్పందగా కనిపిస్తే.. చెక్ చేయండి. ప్రస్తుత చిన్న చిన్న కెమెరాలు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఏమాత్రం సందేహం వచ్చిన పోలీసులకు, లేక అక్కడి సిబ్బందికి సమాచారం ఇవ్వండి. వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్లండి. ట్రైయల్ రూమ్స్‌లో ఉన్న హ్యాంగర్లును ఓసారి చెక్ చేయండి.. అక్కడి గోడలపై నిఘా ఉంచండి! కొన్నిసార్లు చిన్న కెమెరాలు హ్యాంగర్ వెనుక దాచవచ్చు! దాచిన కళ్ళు చెక్క గోడలలో ఖాళీలలో కూడా కనిపిస్తాయి. అద్దంలో గమనించండి..

ఎదురుగా మరో గది లేదా గోడ కనిపిస్తే, అక్కడ ఏదో సమస్య ఉందని అనుకోవచ్చు! అద్దం వెనుక మరో గది ఉంటే, జాగ్రత్తగా ఉండండి! చాలా సార్లు కెమెరాలు ఉండవచ్చు! అద్దం సరైనదో లేదో చెక్ చేయండది.. మీరు తలుపు తట్టినట్లు అద్దం మీద తట్టండి! అద్దం నుండి బోలు శబ్దం ఉంటే, జాగ్రత్త అవసరం! అప్పుడు అద్దాన్ని తాకండి. వేలికి, ప్రతిబింబానికి మధ్య దూరం ఉంటే కెమెరా ఉందని తెలుస్తుంది.

జాగ్రత్తగా ఉండండి! ముఖ్యంగా మీరు బట్టలు మార్చుకునే ముందు ట్రయల్ రూమ్‌లోని లైట్లను ఆఫ్ చేయండి. బట్టలు మార్చుకున్న తర్వాత, లైట్ ఆన్ చేసి, బట్టలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి! లైట్ ఆఫ్‌లో ఉంటే, అక్కడ ఒకవేళా కెమెరా ఉన్నా, దాని వల్ల ఉపయోగం ఉండదు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker