Health

నార్మల్ డెలివరీ అయ్యేందుకు డాక్టర్ చెప్పే టిప్స్ ఇవే. ఆ టెస్ట్ పాజిటివ్ వస్తే..!

నార్మల్ డెలివరీ అయితే భవిష్యత్తుల్లో ఎలాంటి ఇబ్బందులుండవు. అంతేకాదు ఇలా ప్రవసం అయితే మదర్ నుంచి చైల్డ్ కి ఒక ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అందుతోంది. దీని వల్ల పుట్టబోయే బిడ్డకు ఎలాంటి అనారోగ్యాలు తలెత్తవు. అయితే స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాటికి తగిన పరిష్కారం ఎక్కడికి వెళ్లి చూపించుకోవాలి అనే సందేహంతో మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించిన నార్మల్ డెలివరీ అవుతామా .. లేదా అని సందేహంతో ఆందోళనలో ఉంటారు.

అలాంటి వారందరికి నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో దాదాపుగా 10 సంవత్సరముల నుంచి , సుజాత హాస్పిటల్ లో సరైన చికిత్సలు అందిస్తున్నారు. ఎక్కువగా గర్భిణీలకు నార్మల్ డెలివరీనే చేసేందుకు చూస్తుంటామని డాక్టర్ సుజాత మీడియాతో తెలియజేశారు. నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో గర్భిణిలు తమఆసుపత్రికి వస్తూ ఉంటారని తెలిపారు.వారిలో ఎక్కువ శాతం, భయం ఉంటుందన్నారు.

నార్మల్ డెలివరీ అవుతామా, లేదంటే సిజేరియన్చేస్తారమోనని సందేహంలో గర్భిణీలు ఎక్కువగా భయాందోళన చెందుతూ ఉంటారని డాక్టర్ సుజాత తెలిపారు. అలా వచ్చిన గర్భిణీలకు మనో ధైర్యాన్ని ఇస్తూ ప్రతి ఒక్కరికి డాక్టర్ సుజాతవారి పరిస్థితి, స్థితి గతులను తెలుపుతూ గర్భిణీ మనో ధైర్యమే ముఖ్యంగా ఉండాలని తెలియజేస్తూ ఉంటామని తెలిపారు. సుజాత హాస్పిటల్ నందు ప్రతి ఒక్క గర్భిణీకిహెల్త్ చెకప్ లు చేస్తూ, వారికి సాధ్యమైనంతవరకు నార్మల్ డెలివరీ అయ్యే విధంగానే తగు చర్యలు తీసుకుంటూ ఉంటామని తెలిపారు.

ప్రతి నెల నెల,హెల్త్ చెకప్ లు చేయించుకుంటూ ఉండాలని, గర్భిణీ స్త్రీలకు ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేస్తూ ఉంటామని తెలిపారు. తమ ఆసుపత్రిలో ఒక నెల 10 రోజులకు యూరిన్ టెస్ట్ చేయబడునని తెలిపారు. పాజిటివ్ వస్తే, వాటికి తగిన జాగ్రత్తలు, మెడిసిన్, ఇలాంటివన్నీ ఇచ్చి గర్భణీకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతామన్నారు.

ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం రక్త రక్తంలోనే పలు రకాల పరీక్షలు చేసి, ఒక నెల రెండు రోజులకే ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది పూర్తిగా సమాచారం మనకు తెలుస్తుందని డా. సుజాతతెలిపారు.అడ్వాన్సుగా సుజాత హాస్పిటల్లోఇలాంటి పరీక్షలు చేస్తారన్నారు. హాస్పిటల్ కి వచ్చిన ప్రతిరోజు, బిపి, ఇలాంటివి మొదలుకొని అన్ని వసతులు తమ హాస్పిటల్ లో గర్భిణీలకు చేయబడునని తెలియజేశారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker