జ్వరమొస్తే మన శరీరానికి చాలా మంచిది, ఎందుకో తెలుసా..?

మానవ శరీరం సాధారణ ఉష్ణోగ్రత 98.6 డిగ్రీలు. వయస్సు రీత్యా శరీర ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. 100.4 డిగ్రీల టెంపరేచర్ వస్తే జ్వరం వచ్చిందని అర్థం. ఒక్కో సారి శరీర ఉష్ణోగ్రత 100 లోపు ఉన్నా కూడా వణుకురావడం, తలనొప్పి, త్రివర అలసటగా అనిపిస్తే అది జ్వరం వస్తుంది అనేందుకు సంకేతంగా భావించాలి. చిన్న పిల్లల్లో అయితే ఆరిచేతులు, అరికాళ్లు వెచ్చగా ఉండటం, కళ్ళు ఎర్రగా మారిపోవడా, ఛాతీ, వీపు వేడిగా ఉన్నా ఫీవర్ వచ్చే ముందు లక్షణాలు.
హై టెంపరేచర్ కనిపించగానే వైద్యుల దగ్గరకి పరుగు తీస్తారు కొందరు. సాధారణంగా వచ్చిన జ్వరం అయితే మూడు లేదా నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది. అటువంటి సమయంలో శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఎక్కువగా ద్రవ పదార్థాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. బయట తిరగకుండా ఇంట్లోనూ ఉంటూ బాగా విశ్రాంతి తీసుకోవాలి. అయితే కొంచెం జ్వరం రాగానే ఏదో అయిపోతుందని భయపడిపోకండి.. ఒళ్లు కాలిపోతుందని పిడికెడు గోలీలు గుటుక్కున మింగేయకండి.. జ్వరం వచ్చిందా! అయితే రానీలే అని అలా వదిలేయండి సరిపోద్ది.
జ్వరం దానంతట అదే తగ్గిపోతుంది, పైగా అంటువ్యాధులేమైనా ఉంటే వాటినీ తగ్గించేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తేలికపాటి జ్వరం రోగనిరోధక శక్తిని పెంచటంలో దోహదం చేస్తుంది. శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. తేలికపాటి జ్వరం ఒంటికి మంచిదేలే! అని కెనడాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఆల్బర్ట్ ఇమ్యునాలజిస్ట్ ప్రొఫెసర్ డానియెల్ బరెడా అంటున్నారు.
ఆయన నేతృత్వంలోని బృందం.. చేపలకు బ్యాక్టీరియాను సంక్రమింపజేసి, చికిత్స చేయకుండా వదిలేసింది. తర్వాత పరీక్షిస్తే మిత జ్వరం ఇన్ఫెక్షన్లతో వేగంగా పోరాడగలదని తేలింది. వాపు అయిన చోట కణజాలాన్ని సరిచేయగల రోగనిరోధక శక్తి పెంపొందుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మితమైన జ్వరం స్వీయ పరిషారమైనదని, సహజంగా వచ్చే జ్వరం శరీరాన్ని ప్రేరేపించగలదని నిర్ధారణ అయ్యిందని తెలిపారు.
ఏడు రోజుల్లో చేపలను ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడేయటానికి జ్వరం సహాయపడిందని వెల్లడించారు. ఈ వివరాలు ఇమ్యునాలజీ అండ్ ఇన్‌ఫ్లమేషన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మానవులకు సాధారణ జ్వరం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ఇంకా లోతైన పరిశోధనల చేయాల్సి ఉన్నదని అధ్యయనం పేర్కొన్నది.