News

బంగారం కొనే వారికి అదిరే శుభవార్త, భారీగా తగ్గిన బంగారం ధరలు.

అంతర్జాతీయంగా బలహీన సంకేతాల నేపథ్యంలో బంగారం ధర పడిపోతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను వరుసగా నాలుగోసారి యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకోవడం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. అయితే బంగారం ధరలు దిగి వచ్చాయి. పసిడి రేటు భారీగా పడిపోయింది. బంగారం ధరల బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. దీంతో బంగారం, వెండి కొనే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. ఈ నెలలో అంటే ఫిబ్రవరిలో గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా తగ్గాయి.

తెలుగు రాష్ట్రాలలో గోల్డ్, సిల్వర్ ధరలు ఈ నెలలో బలహీనంగానే కదలాడాయని చెప్పుకోవచ్చు. అటు బంగారం ధరలు, ఇటు వెండి రేట్లు రెండూ కూడా దిగి వచ్చాయి. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు వెలవెలబోయాయి. వెండి రేటు కూడా నేల చూపులు చూసింది. ఈ నెలలో గోల్డ్ రేటు భారీగా తగ్గింది. ఇక వెండి రేటు కూడా బలహీనంగానే కొనసాగింది. 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 29న రూ. 62,830 వద్ద ఉంది. అయితే ఈ నెల ఆరంభంలో రూ. 63,600 వద్ద ఉండేది. అంటే బంగారం ధరలు భారీగా తగ్గాయని చెప్పుకోవచ్చు.

ఏకంగా రూ. 770 మేర దిగి వచ్చిందని అనుకోవచ్చు. పది గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధరల విషయానికి వస్తే.. ఈ గోల్డ్ రేటు ఫిబ్రవరి నెల ఆరంభంలో రూ. 58,300 వద్ద ఉండేది. అయితే ఇప్పుడు ఈ గోల్డ్ రేటు రూ. 57,590 వద్ద ఉంది. ఈ గోల్డ్ రేటు కూడా రూ.700కు పైగా తగ్గింది. పది గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. ఇక వెండి రేటు విషయానికి వస్తే.. సిల్వర్ రేటు రూ. 74,200 వద్ద ఉంది.

ఈ నెల 29న ఈ రేటు వర్తిస్తుంది. అయితే వెండి రేటు ఫిబ్రవరి నెల ఆరంభంలో చూస్తే.. రూ.76,500 వద్ద ఉంది. కేజీకి ఈ రేట్లు వర్తిస్తాయి. అంటే వెండి రేటు నెల రోజుల్లో రూ. 2300 పతనమైందని చెప్పుకోవచ్చు. కాగా పైన ఇచ్చిన బంగారం, వెండి ధరలకు జువెలరీ తయారీ చార్జీలు అదనంగా పడతాయి. ఇంకా వస్తు సేవల పన్ను జీఎస్‌టీ కూడా అదనంగా చెల్లించుకోవాలి. అందువల్ల ధరలు మరింత పైకి చేరుతాయని చెప్పుకోవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker