Liver: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? మీ కాలేయం ఎంత ప్రమాదంలో ఉందొ తెలుసుకోండి.

Liver: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? మీ కాలేయం ఎంత ప్రమాదంలో ఉందొ తెలుసుకోండి.
Liver: కాలేయం మానవుని శరీరంలోని అతి పెద్ద గ్రంథి. ఇది ఉదరంలో ఉదరవితానానికి (డయాఫ్రమ) క్రిందగా కుడివైపున మధ్యలో ఉంటుంది. కాలేయము పైత్యరసాన్ని తయారుచేస్తుంది. అది పిత్తాశయంలో నిలువచేయబడి జీర్ణక్రియలో చాలా తోడ్పడుతుంది. అయితే చాలా మంది మొదట కనిపించే లక్షణాలను చిన్నవిగా భావించి పట్టించుకోరు. కానీ శరీరం కొన్ని సూచనలు ముందుగానే ఇవ్వడం మొదలుపెడుతుంది.

వాటిని గమనించి సరైన సమయంలో వైద్యుడిని కలిస్తే చికిత్సను ముందే మొదలుపెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రధాన లక్షణాలు..కుడి పక్క పొట్ట భాగంలో నొప్పి.. లివర్ శరీరంలో కుడి పక్కన ఉంటుంది. కాబట్టి అక్కడ తరచుగా నొప్పి వస్తే అది సమస్యకు సంకేతం కావచ్చు. ఇది మామూలు గ్యాస్ సమస్య కాకుండా లివర్ సంబంధిత సమస్య కూడా అయ్యే అవకాశం ఉంటుంది.
కారణం లేకుండా బరువు తగ్గడం.. ఎలాంటి ప్రత్యేక ఆహారం తీసుకోకుండా.. వ్యాయామం చేయకుండానే బరువు వేగంగా తగ్గితే అది శరీరంలో ఏదో సమస్య ఉందని అర్థం. లివర్ ట్యూమర్ ఉన్నవారిలో ఇది ఒక సాధారణ లక్షణంగా కనిపిస్తుంది. ఆకలి తగ్గడం లేదా తక్కువ తినగానే కడుపు నిండినట్లు అనిపించడం.. చిన్న మొత్తంలో తినగానే కడుపు నిండినట్లు అనిపించడం లేదా ఆకలి లేకపోవడం లివర్ లో ట్యూమర్ పెరగడం వల్ల.. కడుపు భాగంపై ఒత్తిడి పడటం వల్ల జరగవచ్చు.
Also Read : భార్యాభర్తల బంధం బలపడాలంటే..!
శరీరం అలసిపోవడం.. ఎలాంటి కష్టం లేకుండానే అలసిపోవడం, శరీరం బలహీనంగా మారడం లాంటివి లివర్ పనితీరులో లోపం వల్ల కలగవచ్చు. వాంతులు లేదా వికారం.. తరచుగా వాంతులు లేదా ఆకలి లేకపోవడం లివర్ సరిగా పనిచేయడం లేదని చెప్పే సంకేతం. ఇది విరేచనాలు లేకుండా మలబద్ధకం లాంటి సమస్యలతో కూడా రావచ్చు. ఇతర కీలక సంకేతాలు..ముఖం లేదా కళ్ళలో పసుపు రంగు కనిపించడం.. ఇది జాండిస్ గుర్తు.
బిలిరుబిన్ అనే పదార్థం శరీరంలో పేరుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇది లివర్ సరిగా పనిచేయడం లేదని సూచిస్తుంది. కడుపు ఉబ్బరంగా ఉండటం.. పొట్ట భాగం నెమ్మదిగా ఉబ్బిపోవడం, గ్యాస్ నిండినట్లు అనిపించడం లాంటి లక్షణాలు లివర్ బలహీనపడటం వల్ల వచ్చే అసైటిస్ అనే పరిస్థితికి దారితీస్తాయి. ఇది అంతగా కనిపించకపోయినా ముఖ్యమైన సంకేతం. తరచుగా జ్వరాలు రావడం.. లివర్ ఆరోగ్యం తగ్గడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీనివల్ల చిన్న అనారోగ్యాలు కూడా జ్వరంగా మారతాయి.
Also Read : ఉదయాన్నే ఈ భాగాలలో నొప్పులు వస్తున్నాయా..?
ఇది నిర్లక్ష్యం చేయకూడని లక్షణం. చర్మంపై దురద.. చర్మంలో ముఖ్యంగా చేతులు, కాళ్ళపై గుంటల మాదిరిగా దురదగా అనిపించడం కూడా లివర్ పనితీరులో లోపం ఉందని చెప్పే సంకేతం. ఇది బైల్ కణాలు రక్తంలో ఎక్కువగా ఉండటం వల్ల జరుగుతుంది. పొట్ట భాగంలో గడ్డలాంటిది కనిపించడం.. కొన్నిసార్లు లివర్ ట్యూమర్ పెద్దదై కుడి పొట్ట భాగంలో గడ్డలాగా తగలవచ్చు.
ఇది చాలా స్పష్టమైన హెచ్చరిక. దీనిని వెంటనే వైద్యుడికి చూపించాలి. ఈ లక్షణాల్లో ఏవైనా కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని కలవాలి. మొదట్లో లివర్ ట్యూమర్ ను గుర్తిస్తే.. చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు బాగా పెరుగుతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ.. మన శరీరం ఇచ్చే సంకేతాలను గమనించడమే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉత్తమ మార్గం.