Health

ఈ అలవాట్లు ఉంటె వెంటనే మానుకోండి, లేదంటే మీకు అంగస్తంభన సమస్య వస్తుంది.

చాలా మంది తమ లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల గురించి గోప్యంగా ఉంచుతారు. అలా గోప్యంగా ఉంచినంత వరకు సరే కానీ, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. సకాలంలో సరైన వైద్యం తీసుకోకపోతే అది భవిష్యత్తులో మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. ఇటీవలి కాలంలో మగవారిలో అంగస్తంభన కేసులు పెరుగుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. అయితే పురుషులలో అంగస్తంభన లోపం కారణంగా పురుషులు లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకోలేని పరిస్థితి వసొంది. మగవారి వయసుతో పాటు కొన్ని దురలవాట్లు కూడా అందుకు కారణం అవుతున్నాయి.

ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల నపుంసకత్వం కూడా పెరుగుతుంది, ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటి పద్ధతులను ఉపయోగించవచ్చు. ఎక్కువ నిద్రపోవడం వల్ల కూడా నపుంసకత్వం పెరుగుతుంది, శరీరం ఎక్కువగా నిద్రపోవడం అలవాటు చేసుకున్నప్పుడు లైంగిక సామర్థ్యంలో సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని అంచనా. మద్యం సేవించడం వల్ల నపుంసకత్వం పెరుగుతుంది, ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం తగ్గుతుంది. పొగాకులో ఉండే నికోటిన్ నపుంసకత్వాన్ని పెంచుతుంది.

పొగాకు వినియోగం వల్ల పురుషుల వీర్యం నేరుగా దెబ్బతిని వారిని నపుంసకుడిని చేస్తుంది. శారీరక వ్యాయామం లేకపోవడం కూడా నపుంసకత్వాన్ని పెంచుతుంది. యోగా సహా ఇతర వ్యాయామాల ద్వారా శారీరక వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం. ఈ సమస్య నుండి బయటపడేదెలా.. కొన్ని రకాల వ్యాయామాలు చేయడం ద్వారా లైంగికశక్తికి పునరుజ్జీవం కల్పించవచ్చు. రన్నింగ్, స్విమ్మింగ్, ఇతర ఏరోబిక్ వ్యాయామాలు EDని నిరోధించడంలో సహాయపడతాయని నిరూపితమైనవి. కలరిసూత్రం, కెగెల్ వ్యాయామాలు కూడా ఈ సమస్యని తగ్గిస్తాయనే వాదన ఉంది కానీ అందుకు ఆధారాలు లేవు.

అయితే ఎలాంటి వ్యాయామాలు చేసినా కూడా అవి స్క్రోటమ్, పాయువు మధ్య ఉండే పెరినియంపై అధిక ఒత్తిడిని కలగజేయనీయకుండా చూసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కాయలు, చేపలు, రెడ్ వైన్‌ తీసుకునే వారిలో ED సమస్య తలెత్తదు. ఇతర నూనెలకు బదులు ఆలివ్ నూనె తీసుకోవడం ఉత్తమం. అధిక శరీర బరువు కారణంగా టైప్ 2 డయాబెటిస్‌తో సహా అనేక ఆనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అధిక బరువు నరాలను దెబ్బతీస్తాయి. పురుషాంగానికి సరఫరా చేసే నరాలపై ప్రభావం పడితే ED సమస్య రావచ్చు. కాబట్టి బరువును తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి.

అనాబాలిక్ స్టెరాయిడ్లు తీసుకోవద్దు- అథ్లెట్లు, బాడీబిల్డర్లు తరచుగా అనాబాలిక్ స్టెరాయిడ్లు తీసుకుంటున్నట్లు అధ్యయనాల్లో తేలింది. ఇవి వృషణాలను కుదించి, టెస్టోస్టెరాన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ధూమపానం, మద్యపానం వదిలివేయడం మంచింది. సిగరెట్ తాగడం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. పొగాకులో ఉండే నికోటిన్ రక్త నాళాలను సంకోచించేలా చేస్తుంది ఇది పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని నిరోధించవచ్చు. కాబట్టి ధూమపానం, పొగాకు సంబంధింత పదార్థాలు వీలైనంత త్వరగా వదిలేయడం చాలా మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker