News

National Award: ఈ నటుడు జాతీయ అవార్డ్ విన్నర్. ఇప్పుడు అవకాశాలు లేక ఆటో డ్రైవర్ అయ్యాడు..!

National Award: ఈ నటుడు జాతీయ అవార్డ్ విన్నర్. ఇప్పుడు అవకాశాలు లేక ఆటో డ్రైవర్ అయ్యాడు..!

National Award: నటుడు మనుగడ కోసం పోరాటం చేస్తూ ఆటో నడుపుతున్నాడు. ఆస్కార్ వరకు వెళ్ళిన సినిమాలో నటించిన నటుడి దుస్థితి చిత్ర పరిశ్రమకు శాపం. ఎందుకంటే, ఆయన జాతీయ అవార్డు గెలుచుకున్నారు. నేడు ఆయన వీధుల్లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది మాత్రం అవకాశాలు లేక దీన స్థితిలో ఉన్నారు. చాలా మంది నటీ నటులు ఇప్పుడు సినిమాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు.

కొంతమంది ఆర్థిక పరిస్థితి బాలేక రోడ్డుమీద పడిన ఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పటికే పలువురు మీడియా ముందుకు వచ్చి తమ దీన స్థితి గురించి ఆవేదన వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి. అలాంటి వారిలో ఈ నటుడు ఒకరు. ఒప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ ఆయన.. ఇప్పుడు ఆర్ధిక పరిస్థితులు లేక ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సిల్వర్‌స్క్రీన్‌పై ఓ వెలుగు వెలిగి, ఆస్కార్ బరిలో నిలిచిన ఆ నటుడి పరిస్థితి దారుణంగా తయారయ్యింది.

Also Read: కేసీఆర్‌ ఆరోగ్యంపై కీలక ప్రకటన చేసిన యశోద వైద్యులు.

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించాడు ఆ నటుడు.. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించాడు. తన నటనతో ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్నాడు. అంతే కాదు అతను నటించిన సినిమా ఆస్కార్ కు కూడా నామినేట్ అయ్యింది. కానీ ఆతర్వాత ఆయనకు అవకాశాలు కరువయ్యాయి. ఇప్పుడు ఇలా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన పేరు షఫీక్ సయ్యద్‌.

Also Read: ఇప్పటికిప్పుడు 500నోట్లను రద్దు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

సలాం బాంబే! సినిమాతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు. 1988లో విడుదలైన ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమా ముంబై వీధుల్లో బతికే పిల్లల కష్టాలను చూపించారు. ఈ సినిమాకు మీరా నాయర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యింది. ఈ సినిమాలో చాయ్‌పౌ అనే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు.

Also Read: వెంటిలేట‌ర్‌పై తెలుగు కామెడీ విలన్‌ ఫిష్‌ వెంకట్‌, సాయం కోసం వేడుకుంటున్న భార్య‌.

తన అద్భుత నటనకు బెస్ట్ చైల్డ్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. కానీ అతనికి ఆతర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. ఆతర్వాత ‘పతంగ్’ అనే సినిమా ఒక్కటే చేశాడు. అవకాశాలు లేక ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడంతో ఆటో నడుపుతున్నాడు. తల్లి, భార్య, నలుగురు పిల్లలతో ఓ చిన్న ఇంట్లో ఉంటున్నాడు.కుటుంబ భారాన్ని మోస్తూ ఆటో స్టీరింగ్ తిప్పుతున్నాడు షఫీక్ సయ్యద్‌.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker