News

పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం సాధించిన నటి ప్రగతి, వైరల్ వీడియో

ప్రగతి 47 ఏళ్ళ వయసులో ఇంత కష్టపడి పవర్ లిఫ్టింగ్ లో ఏకంగా సౌత్ ఇండియన్ చాంప్ అవ్వడంతో అంతా ఆశ్చర్యపోతూ ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రలువురు ప్రముఖులు, నెటిజన్లు ప్రగతికి కంగ్రాట్స్ చెప్తున్నారు. త్వరలో నేషనల్ ఛాంపియన్ షిప్ లో కూడా ప్రగతి పాల్గొంటుందని సమాచారం. ఈ వయసులో ప్రగతి ఓ పక్క యాక్టింగ్ చేస్తూ మరో పక్క తన బాడీ బిల్డ్ మీద ఫోకస్ చేసి ఇలా ఛాంపియన్ షిప్ లో పాల్గొని గెలవడం అంటే మాములు విషయం కాదు, ఎంతోమంది మహిళలకు ఆమె ఆదర్శం.

అయితే టాలీవుడ్ క్యారెక్టర్ నటి ప్రగతి ఫిట్ నెస్ కు ఎంతో ప్రాధాన్యమిస్తారని తెలుసుగానీ, ఏకంగా జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం సాధిస్తారని ఎవరూ ఊహించి ఉండరు. షూటింగ్ లు లేకపోతే జిమ్ లో ఎక్కువగా గడిపే ప్రగతి నేషనల్ లెవల్ లో తన సత్తా ఏంటో చూపించారు. ఇటీవల బెంగళూరులో 28వ పురుషులు, మహిళల జాతీయ స్థాయి బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ జరిగింది.

ఈ పోటీల్లో పాల్గొన్న ప్రగతి మూడో స్థానంలో నిలిచి కాంస్యం కైవసం చేసుకున్నారు. ఈ పోటీలకు బెంగళూరులోని ఇంజినీర్స్ అసోసియేషన్ ఆడిటోరియం వేదికగా నిలిచింది. ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్లతో పోటీ పడి ప్రగతి ఈ పతకం సాధించడం విశేషం. ప్రస్తుతం ప్రగతి అనేక సినిమాలతో పాటు టీవీ సీరియళ్లలోనూ నటిస్తున్నారు. ఆమె నటిస్తున్న ‘ఊర్వశివో రాక్షసివో’ సీరియల్ త్వరలోనే ప్రసారం కానుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker