Health

పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలను ప్రెషర్ కుక్కర్‌లో వండకండి. విషంతో సమానం.

సాధారణంగా ప్రెజర్ కుక్కర్ లో చాలామంది చేసే ఆహార పదార్థాలలో అన్నం ఒకటి. అయితే పొరపాటున కూడా ప్రెజర్ కుక్కర్ లో అన్నం వండకూడదు. ప్రెజర్ కుక్కర్లో అన్నం వండటం వల్ల అది విష పదార్థంగా మారుతుంది. ప్రెజర్ కుక్కర్ లో అన్నం చేయడం వల్ల అక్రిలమైడ్ అనే హానికరమైన రసాయనం ఏర్పడుతుంది. దీని ప్రభావం వెంటనే చూపకపోయినా నిదానంగా ఈ రసాయనాల ప్రభావం మనపై చూపడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు మనల్ని వెంటాడుతాయి. అయితే ప్పు, అన్నం, కూరగాయలు, బిర్యానీ వంటి వంటకాలు కుక్ చేయడానికి ఇవి బాగా పనికొస్తాయి.

అయితే అన్ని రకాల ఆహారాలను ప్రెజర్ కుక్కర్‌లో వండకూడదు. ఆకు కూరలు:- ప్రెజర్ కుక్కర్‌లో ఆకుకూరలు వండితే, అవి మెత్తగా తయారై పాడైపోతాయి. ఆకు కూరలు చాలా మృదువుగా ఉంటాయి, ప్రెజర్ కుక్కర్‌లో ఉడికిస్తే వాటి రుచిని కోల్పోతాయి. అందుకే వేరే పద్ధతిలో ఉడకబెట్టడం మంచిది. సీ ఫుడ్:- చేపలు, రొయ్యలు, షెల్ఫిష్ వంటి సీఫుడ్, ప్రెషర్ కుక్కర్‌లో అతిగా ఉడికిస్తే రబ్బర్‌గా తయారవుతాయి. సహజమైన రుచి, ఆకృతిని కోల్పోతాయి, అందువల్ల తక్కువ వేడి మీద, కొద్దిసేపు సీఫుడ్ ఉడికించడం మంచిది. డెయిరీ ప్రొడక్ట్స్:- ప్రెజర్ కుక్కర్‌లో డెయిరీ ఫుడ్స్ కుక్ చేయకూడదు.

ఎందుకంటే పాలు, చీజ్, క్రీమ్ వంటి పాల ఉత్పత్తులు అధిక ఉష్ణోగ్రతల వద్ద విరిగిపోతాయి. దీనివల్ల వాటి రుచి చెడిపోతుంది. ఫ్రై ఫుడ్:- వడలు లేదా చిప్స్ వంటి క్రిస్పీ, క్రంచీ స్నాక్స్‌ ప్రిపేర్ చేయడానికి ప్రెజర్ కుక్కర్‌ ఉపయోగించకూడదు. అవి కుక్కర్‌లో సరిగా ఫ్రై కావు. పచ్చిగా, తడి తడిగానే ఉంటాయి. రుచి కూడా అస్సలు బాగుండదు. కొన్ని కూరగాయలను దోరగా వేయించడానికి ప్రెజర్ కుక్కర్ వాడొచ్చు కానీ డీప్ ఫ్రై చేయడానికి వాడకూడదు. పాస్తా:- ప్రెజర్ కుక్కర్‌లో పాస్తా వండిగే, అది అతిగా ఉడికి తినలేనంత మెత్తగా తయారవుతుంది. కాబట్టి పొయ్యి మీద పాన్‌లో ఉడకబెట్టడం మంచిది. అప్పుడే ఎంతసేపు ఉడికించాలి ఎంత నీరు పోయాలనేది తెలుస్తుంది.

పప్పులు, బియ్యం వంటి కఠినమైన, పొడి ఆహారాలు కుక్ చేయడానికి ప్రెజర్ కుక్కర్లు ఉత్తమంగా నిలుస్తాయి. బేకింగ్ ఫుడ్ ఐటమ్స్:- ప్రెజర్ కుక్కర్‌లో కేక్‌లు, యాపిల్ పై వంటివి బేక్‌ చేయడం సాధ్యమే, కానీ కొన్ని పదార్థాలు బాగా ఉడకకపోవచ్చు. ఇవి కోరుకున్నంత మెత్తగా ఉండకపోవచ్చు. మఫిన్లు, పైలు, పఫ్స్ వంటి బేకింగ్ ఆహార పదార్థాలకు ఓవెన్ లేదా మైక్రోవేవ్ మాత్రమే బాగా సూట్ అవుతాయి. వీటిలో ఉష్ణోగ్రత, సమయాన్ని సర్దుబాటు చేయవచ్చు.

చిక్కటి సూప్‌లు:- చిక్కటి సూప్‌లు ప్రెజర్ కుక్కర్‌లో ప్రిపేర్ చేయవచ్చని చాలామంది అనుకుంటారు, ఎందుకంటే సూప్‌లో బాగా ఉడికించాల్సిన అనేక పదార్థాలను ఉంటాయి. కానీ ప్రెజర్ కుక్కర్‌లో చిక్కటి సూప్‌లను ఉడికిస్తే, పల్చగా తయారు కావచ్చు, లేదంటే రుచి లేకుండా చప్పగా ఉండొచ్చు. ఎందుకంటే ప్రెజర్ కుక్కర్ చాలా ఆవిరిని విడుదల చేస్తుంది, రుచిని పలుచన చేస్తుంది. సూప్ కోసం ప్రెజర్ కుక్కర్‌ను ఉపయోగించాల్సి వస్తే, చివర్లో మెత్తటి పదార్థాలు, పాల ఉత్పత్తులను వేసి, బాగా కలపాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker