Health

నిద్రలో మీ నోరు పొడిబారుతోందా..? ఈ ప్రమాదకరమైన వ్యాధులు మీకు రావొచ్చు.

మన శరీరంలోని అన్ని భాగాలు ఒకదానితో ఒకటి అనుసంధానం అయ్యి ఉంటాయని తెలిసిందే. మన శరీరంలోని ఏదైనా భాగంలో సమస్య ఏర్పడినప్పుడు, దాని సంకేతాలు ఇతర ప్రదేశాలలో కనిపించడం ప్రారంభిస్తాయి. నోటి ఆరోగ్యం బలహీనంగా ఉంటే, అది శరీరంలో సంభవించే కొన్ని తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. నోరు తరచుగా పొడిబారడం అనేది శరీరంలోకి ఏదో సరిగ్గా జరగడం లేదని సంకేతంగా గుర్తించాలి.

అయితే కొంతమందికి నిద్రపోతున్నప్పుడు ఉన్నట్టుండి గొంతు పొడిబారడం స్టార్ట్ అవుతుంది. అయితే ఎక్కువ సేపు నీళ్లను తాగకుండా ఉంటే కూడా గొందు ఎండిపోతుంది. దీనివల్ల ఈ ఎలాంటి సమస్య లేదు. అయినా ఇలాంటి సమస్యా ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వస్తుంది. అయితే డయాబెటీస్.. డయాబెటీస్ రోగులు కూడా గొంతుపొడిబారే సమస్యతో ఇబ్బంది పడతారు. డయాబెటీస్ లో ఇదికూడా ఒక లక్షణమే అంటున్నారు నిపుణులు.

డయాబెటీస్ రోగుల్లో శక్తి లోపించగానే గొంతు ఎండిపోవడం మొదలవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే కూడా గొంతు పొడిబారడం మొదలవుతుంది. మీరు పుష్కలంగా నీరు తాగిన తర్వాత కూడా గొంతు ఎండిపోతే.. మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగాయని అర్థం చేసుకోవాలి. సైనస్.. చాలా మందికి సైనస్ సమస్య వల్ల నోటినుంచి శ్వాస తీసుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితిలో సైనస్ తో బాధపడుతున్న వ్యక్తులు రాత్రిపూట నోరు తెరిచే గాలి తీసుకుంటారు. ఇలా నోటితో గాలి పీల్చడం వల్ల గొంతు పొడిబారుతుంది.

పాలీడిప్సియా.. పాలిడిప్సియా లక్షణాల్లో నిద్రపోతున్నప్పుడు గొంతు పొడిబారడం కూడా ఒకటి. పాలీడిప్సియా వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. మన శరీరానికి నీటి అవసరం ఏర్పడినప్పుడు గొంతు ఇలా పొడిబారడం స్టార్ట్ అవుతుంది. నిర్జలీకరణం.. నీరు మన శరీరానికి చాలా చాలా అవసరం. కానీ కొంతమంది తాగాల్సిన వాటికంటే చాలా తక్కువగా నీళ్లను తాగుతుంటారు. దీనివల్ల శరీరంలోని నీటి కొరత ఏర్పడుతుంది. శరీరంలో నీరు లేకపోవడం అంటే డీహైడ్రేషన్ వల్ల రాత్రిళ్లు గొంతు పొడిబారే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నీళ్లను తక్కువగా తాగడం వల్ల గొంతు పొడిబారడం, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

ఉప్పు, నూనె, సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా ఉపయోగించడం.. ఉప్పును ఎక్కువగా తింటే బాడీ డీహైడ్రేషన్ సమస్య బారిన పడుతుంది. పూరి, దాల్ బాటీ లేదా నూనె, మసాలాలు ఎక్కువగా ఉపయోగించిన ఆహారాలను తింటే కూడా తరచుగా దాహం అవుతుంటుంది. దీనివల్ల గొంతు పొడిబారుతుంది. మసాలా దినుసులు, నూనె ఎక్కువగా ఉండే ఆహారాల వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దీన్ని ఎలా తగ్గించుకోవాలి.. పడుకునేటప్పుడు గొంతు పొడిబారే సమస్య ఉన్నట్టైతే.. రోజూ 8 నుంచి 10 గ్లాసుల నీటిని ఖచ్చితతంగా తాగండి. అలాగే నోరు తెరిచి నిద్రపోకండి. ముక్కు ద్వారే గాలి పీల్చడానికి ప్రయత్నించండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker