Soniya Singh: కాశీలో శివుని భక్తిలో లీనమైపోయిన టాలీవుడ్ హీరోయిన్..! వీడియో వైరల్.

Soniya Singh: కాశీలో శివుని భక్తిలో లీనమైపోయిన టాలీవుడ్ హీరోయిన్..! వీడియో వైరల్.
Soniya Singh: కెరీర్ స్టార్టింగ్లో షార్ట్ ఫిల్మ్స్ ఫేమస్ అయిన ఈ చిన్నది అనతి కాలంలోనే అక్కడ పాపులారిటీ సంపాదించుకున్నది. తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. దీంతో సినిమాల్లో నటించే చాన్స్ వచ్చింది. అయితే మొదటి సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో అద్బతంగా నటించింది. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో ఆకట్టుకుంది.

మరో సినిమాలోనూ మెరిసిన ఈముద్దుగుమ్మ ఢీ వంటి పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తుంటుంది. సినిమాలు, టీవీ షోలతో పాటు తన రిలేషన్ షిప్ తోనూ వార్తల్లో నిలిచిందీ ఈ సొగసరి. కెరీర్ ప్రారంభంలో తన బాయ్ ఫ్రెండ్ తో నే కలిసి వీడియోలు చేసిందీ ముద్దుగుమ్మ. ఆ మధ్యన తన ప్రియుడితో కలిసి ఓ సినిమాలోనూ నటించింది. ఈ బ్యూటీకి కాస్త ఆధ్యాత్మిక చింతన ఎక్కువే.
Also Read: కేసీఆర్ ఆరోగ్యంపై కీలక ప్రకటన చేసిన యశోద వైద్యులు.
ఆ మధ్యన అరుణాచలేశ్వరుడిని దర్శించకుని ప్రత్యేక పూజలు చేసింది. ఆ ఫొటోలు నెట్టింట బాగా వైరలయ్యాయి. ఇప్పుడు సడెన్ గా కాశీలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచింది. పూర్తిగా భక్తి భావనలో లీనమైపోయిన ఆమె కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ సందర్భంగా ట్రెడిషనల్ శారీ, మెడలో మాలతో కనిపించి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది.
Also Read: వెంటిలేటర్‌పై తెలుగు కామెడీ విలన్ ఫిష్ వెంకట్, సాయం కోసం వేడుకుంటున్న భార్య.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.మరి ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు విరూపాక్ష ఫేమ్ సోనియా సింగ్. 2023లో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది సోనియా.