అహింస మూవీ అట్టర్ ఫ్లాప్ అంటూ హీరో పై శ్రీరెడ్డి సంచలన వ్యాక్యలు.

దగ్గుబాటి వారసుడు అభిరామ్ ను హీరోగా టాలీవుడ్ కు పరిచయం చేస్తూ తేజ .. తన పంథాలోనే సినిమా తీశాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ మంచి ఆసక్తినే క్రియేట్ చేసాయి.
ఇక ఎన్నో అంచనాల మధ్య నేడు రిలీజ్ అయ్యిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంది.కొంతమంది సినిమాలో మొత్తం హింసనే చూపించారు. అయితే టాలీవుడ్ సూపర్ హిట్ ప్రొడ్యూసర్, ఎస్పీ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు రెండో తనయుడు అభిరామ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు.
తేజ దర్శకత్వంలో అహింస మూవీతో అభి టాలీవుడ్ లో అరంగేట్రం చేశాడు. ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గీతికా హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా నిన్న థియేటర్లలో రిలీజ్ అయింది.
ఈ సినిమా జనాలకు పెద్దగా ఎక్కలేదని తెలుస్తోంది. స్టోరీ నచ్చకపోవడంతో ఈ సినిమా చూసేందుకు జనాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ తరుణంలోనే టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి.. అహింస సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
అహింస సినిమా అట్టర్ ప్లాప్ అయిందంటూ పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. హింసతో మమ్మల్ని చంపకండి అంటూ… హీరో అభిరామ్ ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేసింది. తేజ డైరెక్షన్ అస్సలు బాగా లేదంటూ మండిపడింది శ్రీ రెడ్డి.