వేసవిలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తాగాల్సిన జ్యూస్ ఇదే. దీంతో రోజంతా ఉత్సాహంతో..?

చెరకు రసం అలసట, నిస్సత్తువను తగ్గించి తక్షణ శక్తిని అందిస్తుంది. శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తుంది. చెరకులో పిండిపదార్థాలు, ఫైబర్, పొటాషియం, జింక్, ఫాస్ఫరస్, క్యాల్షియం, ఐరన్ లాంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్-ఎ, బి, సి కూడా మెండుగా ఉంటాయి. శరీరంలో ప్రొటీన్ స్థాయులను పెంచుతుంది. అలాగే మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే వేసవి మొదలైంది. మండే ఎండలకు మనమందరం చల్లటి పదార్థాలను ఎక్కువగా తినడానికి ఇష్టపడతాము. అందుకే వేసవిలో చాలా మంది శీతల పానీయాలు, మజ్జిగ వంటివి తీసుకుంటారు.
అయితే వీటికి బదులు చెరుకు రసం తాగితే మీ శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవును, చెరకు రసం తాగడం వల్ల దాహం తీరడమే కాకుండా అనేక ప్రయోజనాలను కూడా పొందవచ్చు. చెరకు రసంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఐరన్ వంటి గుణాలు ఇందులో అధికంగా ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి మేలు చేసేవే. చెరకు రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.
చెరుకు రసం తాగడం వల్ల కలిగే లాభాలు.. రోగనిరోధక శక్తి బలపడుతుంది.. చెరకు రసం ఒక సహజ రోగనిరోధక శక్తిని పెంచే పానీయం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, ఫోటోప్రొటెక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి శరీరం రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ప్రతిరోజూ చెరకు రసాన్ని తీసుకుంటే మీ రోగనిరోధక శక్తి బలంగా మారటంతో పాటుగా మీరు అనేక వ్యాధుల నుండి బయటపడతారు.శరీరంలో శక్తి నిలిచి ఉంటుంది.. చెరకు రసం ఒక సూపర్ ఎనర్జీ డ్రింక్.
అందుకే చెరుకు రసం తాగినట్టయితే, ఎనర్జీ లెవెల్ పెరిగి అలసట దూరమవుతుంది. అంతే కాదు దీన్ని తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఎముకలు దృఢంగా మారతాయి.. చెరుకు రసం తాగితే ఎముకలు దృఢంగా మారుతాయి. ఇందులో క్యాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి.
అందుకే రోజూ చెరుకు రసం తాగడం వల్ల ఎముకల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కలేయం ఆరోగ్యంగా ఉంటుంది.. చెరకు రసం కాలేయానికి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది.