Health

మీకు ఈ అలవాట్లు ఉంటె వెంటనే మార్చుకోండి లేదంటే చాలా కష్టం. ఎందుకంటే..?

చాలామంది మొబైల్ ఫోన్ ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది మెదడును దెబ్బతీస్తుంది. దీనివల్ల మనకు సరిగ్గా నిద్ర కూడా పట్టదు. చాలామంది బిజీగా ఉన్నాము అన్న పేరుతో సరైన ఆహారం తీసుకోరు. శరీరానికి కావలసినంత నీటిని, పౌష్టికాహారాన్ని తీసుకోకపోవడం వల్ల అది మెదడు పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది మెదడుకు ఏమాత్రం మంచిది కాదు. అయితే మనం ఏ పని చేయాలన్నా.. ఎనర్జీ అనేది ముఖ్యం. సరైన శక్తి లేకపోతే ఏ పని చేయలేం. అంతే కాకుండా నీరసంగా, నిరాశగా అనిపిస్తుంది. ఇది ఒత్తిడికి కూడా కారణం అవుతుంది.

తగినంత నిద్ర, మంచి హెల్దీ ఫుడ్, వ్యాయామం వంటివి ఒత్తిడిని కంట్రోల్ చేసి.. ఇమ్యూనిటీని మెరుగు పరుస్తాయి. శక్తి ఉంటేనే ఆక్సిజన్ సరఫరా, జీవ క్రియను ప్రోత్సహిస్తాయి. అయితే కొన్ని అలవాట్ల కారణంగా రోగ నిరోధక శక్తి స్థాయిలు తగ్గిపోతాయి. ఇవి మీ పని తీరును ప్రభావితం చేస్తాయి. ఫలితంగా మనకు తెలియకుండానే ఇమ్యూనిటీ లోపించి.. ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుంది. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం:- కెఫిన్ ఉన్న ఆహారం లేదా కాఫీలు, టీ, కూల్ డ్రింక్స్ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఎనర్టీ లెవల్స్ అనేవి తగ్గిపోతాయి. దీంతో నీరసంగా ఉంటుంది.

వీటికి బదులుగా ఫ్రూట్ జ్యూస్ లు, హెర్బల్ టీలు, కోకోనట్ వాటర్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇలాంటివి తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవల్స్ అనేవి స్థిరంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ చేస్తాయి. సరైన నిద్ర:- చాలా మంది సరిగ్గా నిద్రపోరు. సరైన నిద్ర లేకపోతే ఆరోగ్యంపై చాలా ఎఫెక్ట్ పడుతుంది. అంతే కాకుండా నిద్ర సరిగ్గా లేకపోతే మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. నిద్ర లేని కారణంగా ఒత్తిడి, డిప్రెషన్ వంటివి ఎక్కువ అవుతాయి. చాలా మంది నిద్రపోయే సమయంలో మొబైల్స్ ఫోన్ చూడటం, టీవీలు చూడటం, ఆలస్యంగా నిద్ర పోవడం వల్ల మనిషికి సరైన నిద్ర ఉండటం లేదు. దీని వల్ల మీ ఎనర్జీ లెవల్స్ అనేవి తగ్గిపోతాయి.

ఒక మనిషికి ప్రతి రోజూ 7 నుంచి 8 గంటల నిద్ర చాలా అవసరం. డీహైడ్రేషన్:- చాలా మంది పనిలో పడి తగినంత నీరు తీసుకోరు. కేవలం దాహం వేసినప్పుడు మాత్రమే నీటిని తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎనర్జీ లెవల్స్ అనేవి మొత్తం పడిపోయి.. డీహైడ్రేషన్ కు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి తగినంత నీరు తీసుకోవడం ఉత్తమం. సూర్య కాంతిలో ఉండాలి:-మనలో చాలా మంది ఎండలో ఎక్స్ పోజ్ అవ్వడం లేదు. దీని వల్ల విటమిన్ డి లోపం ఎదురవుతుంది.

అంతే కాకుండా సిర్కాడియన్ రిథమ్ కు బ్రేక్ పడుతుంది. దీని వల్ల శరీరానికి కావాల్సినంత ఎనర్జీ లెవల్స్ ఉండటం లేదు. అలాగే నిద్ర బాగా పట్టాలంటే ఉదయం, సాయంత్రం పూట వచ్చే ఎండలో కొంత సేపు ఉండాలి. గుడ్ లైఫ్ స్టైల్:-మన లైఫ్ స్టైల్ లో కూడా మార్పులు చేసుకోవాలి. మనలో చాలా మంది వివిధ రకాల జాబ్స్ చేస్తూంటారు. ఎక్కువ సేపు కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి ఉంటాయి. వీటి వల్ల నుంచి వచ్చే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవాలంటే.. ఎనర్జీ లెవల్స్ అనేవి ఉండాలి. కాబట్టి ఇలాంటి జాబ్స్ చేసే వారు ఎవరైనా వ్యాయామం తప్పకుండా చేయాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker