Health

మీరు వాడె టూత్ పేస్ట్ ఎంత ప్రమాదకరమో ఈ రంగులను బట్టి తెలుసుకోవచ్చు, ఎలానో చుడండి.

ఇంటర్నెట్ వినియోగం విరివిగా పెరిగిన నేపథ్యంలో చాలా మంది సమాచారం కోసం గూగుల్ మీదే ఆధారపడుతున్నారు. నెట్ నుంచి వచ్చే డేటాలో అవాస్తవాలు ఉన్నా, వాటినే నిజం అని నమ్ముతున్నారు చాలా మంది. అలాగే టూత్ పేస్ట్ ట్యూబ్ మీద ఉన్న రంగుల విషయంలోనూ చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. అయితే మనం ప్రతి రోజూ ఉదయం పళ్లు తోముకున్నాకే దినచర్య మొదలవుతుంది. తెల్లవారుఝామున నిద్రలేచిన వెంటనే..బ్రష్‌పై టూత్‌ పెట్టుకొని శుభ్రంగా పళ్లు తోముకుంటాం.

అయితే మార్కెట్లో అనేక కంపెనీల టూత్ పేస్ట్‌లు ఉన్నప్పటికీ..అన్ని కంపెనీ ట్యూబ్‌లకు కామన్ పాయింట్ ఉంటుంది. అవే రంగులు. మీరెప్పుడైనా టూత్ పేస్ట్ తోకభాగాన్ని గమనించారా? మీరు షార్ప్ మైండెడ్ అయితే. మీ పేస్ట్ వెనుక ఉన్న రంగును మీరు తప్పనిసరిగా చెక్ చేసి ఉండాలి. లేదంటే వెంటనే మీ పేస్ట్ ట్యూబ్ తోకభాగం చూడండి. అక్కడ ఖచ్చితంగా చతరస్రాకారంలో ఒక గుర్తు ఉంటుంది. ప్రతి ట్యూబ్‌కు ప్రత్యేకమైన రంగులో గుర్తు ఉంటుంది.

సాధారణంగా ఎరుపు, నలుగు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో ఉంటాయి. మరి ఈ రంగులకు అర్థమేంటి? అవి మనకు ఏం చెబుతున్నాయి? తప్పకుండా తెలుసుకోవాలి. వీటి గురించి తెలుసుకున్న తర్వాత..ఇకపై టూత్ పేస్ట్ కొనేముందు వాటిపై గుర్తును ఖచ్చితంగా చెక్ చేసి.. ఆ తర్వాత కొనండి. పేస్ట్‌ను కొనుగోలు చేసే ముందు రంగును తనిఖీ చేయకపోతే.. మీ దంతాలు బలంగా అవడం కాదు.. మరింత దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే ఈ రంగులకు అర్థమేంటో తెలుసుకోండి.

టూత్‌పేస్ట్ ట్యూబ్‌పై దానిపై నలుపు రంగు కనిపిస్తే.. ఆ పేస్ట్‌ తయారీలో రసాయనాలు వినియోగించారని అర్థం. ఇలాంటి పేస్ట్‌ను కొనుగోలు చేయకుండా ఉండాలి. టూత్‌పేస్ట్‌పై ఎరుపు గుర్తు ఉంటే అది మిశ్రమమైనది అర్థం. ఇందులో సహజసిద్ధమైన పదార్థాలు ఉంటాయి. కానీ దానితో పాటు అనేక రకాల రసాయనాలు కూడా ఉన్నాయి.

నీలం రంగు ఉంటే ఈ పేస్ట్‌లో సహజ పదార్థాలతో పాటు ఇతర మందులు కూడా ఉంటాయి. మీరు ఒకవేళ సురక్షితమైన పేస్ట్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. ఆకుపచ్చ రంగులో ఉన్న ట్యూబ్‌ను కొనుగోలు చేయాలి. ఇది అత్యంత సురక్షితమైనది. ఇందులో సహజమైన వస్తువులను మాత్రమే ఉపయోగించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker