Life Style

రోజూ 5 నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.

సరిగ్గా చదవక పోయినా మా ఉపాధ్యాయులు మాకు పనిష్మెంట్ ఇచ్చేవారు. గోడ కుర్చీ వేయించేవారు, గుంజీలు తీయించేవారు అంటూ తమ చిన్నతనంలో స్కూల్ ముచ్చట్లను చెబుతుంటారు. అయితే ఇలా టీచర్ గోడ కుర్చీ వేయిస్తే.. అది శిక్షగా అనుకునేవారు.. కానీ అప్పటి శిక్షల్లో కూడా ఆరోగ్య రహస్యాలు దాగున్నాయని పలు పరిశోధనద్వారా తెలుస్తోంది. అవును గోడ కుర్చీ వేయడం త‌ప్పు చేస్తే ఇచ్చే ప‌నిష్మెంట్ కాదు.. అది వ్యాయామంలో ఒకటి అంటున్నారు.

పిల్లలు, పెద్దలు వృద్ధులు ఎవరైనా సరే రోజుకు కేవలం ఐదు నిమిషాల పాటు గోడ కుర్చీ వేస్తె.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే గోడ కుర్చీ వ్యాయామం వేసేందుకు జిమ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. వేలకు వేలుగా ఫీజులు కట్టాల్సిన పని లేదు. ఇంట్లోనే చేసుకోవచ్చు. గోడకు ఆనుకుని ఉంటే ఒక కుర్చీ ఎలా ఉంటుందో గుర్తుచేసుకోండి. గోడకు శరీరాన్ని కుర్చీ పోజులో పెట్టుకోవాలి. కదలకుండా ఉండాలి.

ఇది చేసేందుకు గోడకు మీ రెండు పాదాలను సుమారు అడుగు వ్యత్యాసంలో ఉంచి నిటారుగా నిలబడాలి. మోకాలు నుంచి పాదాల వరకూ కాళ్లను నిటారుగా ఉంచుతూ వంగి, మోకాలి నుంచి పిరుదుల వరకూ శరీర మధ్య భాగం.. భూమికి సమాంతరంగా చేసి శరీర పై భాగాన్ని నిటారుగా చేయాలి. శరీరంలోని పైభాగం గోడకు ఉంటుంది.

చేతులు బార్లా చాపి.. భూమికి సమాంతరంగా పెడితే.. అవి గోడకు ఆనుకుని ఉంటాయన్నమాట. మీరు గోడకుర్చీ పోజుకి వస్తారు. కదలకుండా ఐదు నిమిషాలు చేయండి. దీనివల్ల కండ‌రాలు దృఢంగా మారుతాయి. వెన్నెముక ఆరోగ్యంగా ఉంటుంది. వెన్ను నొప్పి కూడా త‌గ్గుతుంది. గోడ కుర్చీతో క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. బరువు కూడా తగ్గొచ్చు. హృదయ సంబంధం వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

గోడ కుర్చీతో కాళ్లలో ఉండే కండరాలు దృఢంగా అవుతాయి. పొట్ట వద్ద ఉండే కండరాలు.., బలంగా తయారై, పొట్ట కూడా తగ్గుతుంది. పొట్ట చుట్టూ కొవ్వు ఉండేవారు.. రెగ్యులర్ గా గోడ కూర్చి వేయాలి. ఒత్తిడి, ఆందోళనతో బాధపడేవారు.., ఈ వ్యాయామం చేస్తే.. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker