మహిళలకు శుభవార్త, 21 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా అకౌంట్లలోకి రూ.1000.

ప్రభుత్వం మహిళలకు ప్రోత్సాహం ఇచ్చేందుకే ఈ నగదు సాయం చేస్తున్నామని చెబుతోంది కానీ పలువురు మాత్రం ఇది ఎన్నికల స్టంట్ అని విమర్శలు చేస్తున్నారు.కాగా కొత్త పథకం ద్వారా ఒక కోటి 25 లక్షల మంది మహిళలు లబ్ధి పొందనున్నారని సమాచారం. అయితే తమిళనాడు ప్రభుత్వం మహిళల కోసం స్పెషల్ స్కీమ్ తీసుకువచ్చింది. మరో సంక్షేమ పథకాన్ని ప్రకటించింది. కలైగ్నర్ ఉమెన్స్ రైట్స్ గ్రాంట్ స్కీమ్ దీని పేరు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ స్కీమ్ తీసుకువచ్చారు.
ఇటీవలనే కాంచీపురంలో సీఎం ఈ స్కీమ్‌ను ప్రకటించారు. దీని ద్వారా మహిళలకు ప్రతి నెలా డబ్బులు లభించనున్నాయి. అకౌంట్లలోకి డబ్బులు నేరుగా జమ కానున్నాయి. ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన వారికి ముఖ్య మంత్రి డెబిట్ కార్డులు కూడా అందించారు. ఈ స్కీమ్‌లో భాగంగా అర్హత కలిగిన మహిళల బ్యాంక్ అకౌంట్లలో ప్రతి నెల రూ.1000 జమ అవుతూ వస్తాయి. ఈ స్కీమ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 7 వేల కోట్లు కేటాయించింది. బడ్జెట్‌లోనే ఈ స్కీమ్ కేటాయింపులు జరిగాయి.
తమిళనాడుతో ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాల్లో కెల్లా ఈ స్కీమ్‌కే ప్రభుత్వం ఎక్కువగా డబ్బులు కేటాయించడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం చూస్తే.. ఈ స్కీమ్ కింద దాదాపు 1.63 కోట్ల మేర దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది. వెరిఫికేషన్ తర్వాత ఈ స్కీమ్ కింద అర్హత పొందిన వారి సంఖ్య 1.06 కోట్లుగా ఉంది. అంటే వీరందరికీ రూ. 1000 చొప్పున డబ్బులు లభిస్తాయి.
అర్హత కలిగిన మహిళలకు ఎస్ఎంఎస్ రూపంలో ఆ విషయం ఇప్పటికే చేరిందని చెప్పుకోవచ్చు. మహిళల బ్యాంక్ ఖాతాల్లోని ఈ డబ్బులు నేరుగా జమ అవుతాయి. డెబిట్ కార్డుల ద్వారా ఈ డబ్బులను ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. 21 ఏళ్లకు పైన వయసు కలిగిన మహిళలు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు. అలాగే ట్రాన్స్‌జెండర్లు కూడా అప్లై చేసుకోవచ్చు. వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు మించకూడదు.
అలాగే వార్షిక విద్యుత్ వినియోగం 3600 యూనిట్లకు తక్కువగా ఉన్న కుటుంబాలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. బ్యాంక్ ఉద్యోగులు, రాష్ట్ర ఉద్యోగులు, కేంద్ర ఉద్యోగులు, ఇన్‌కమ్ టయాక్స్ పేయలర్లు, పెన్షనర్లు, ఫోర్ వీలర్ ఉన్న వారు ఈ స్కీమ్‌కు అనర్హులు.