Health

రోజు నిద్రపోయేముందు రెండు యాలకులు తింటే ఎంత మంచిదో తెలుసుకోండి.

యాలకులు.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతాయి. యాలకులు గరం మసాలాల్లో ఉపయోగిస్తారు. దీని సువాసన ఎంతగానో ఆకర్షిస్తుంది. యాలకులను స్వీట్లు, టీ, పలు రకాల వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. యాలకుల వాడకం ఆహార రుచిని పెంచడమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చాలా మంది రోజు నిద్రపోయే ముందు పాలు తాగి పడుకుంటారు. ఇది నిద్రని ప్రేరేపిస్తుందని నమ్ముతారు. వాటిలో యాలకులు కూడా చేరిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా నిద్రపోవచ్చు. యాలకులను ఇలాచి అని కూడా పిలుస్తారు.

భారతీయ వంటలు, డెజర్ట్ లు తయారు చేయడంలో విస్తృతంగా వీటిని ఉపయోగిస్తారు. యాలకులు శక్తివంతమైన ఔషధ ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. దీన్ని పాలతో కలిపి తీసుకుంటే ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందవచ్చు. మంచి నిద్రని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. పడుకునే ముందు వీటిని తీసుకోవడం వల్ల కామ కోరికలను పెంచుతుంది. జీవక్రియ రేటుని మెరుగుపరుస్తుంది. అంతే కాదు రక్తపోటుని అదుపులో ఉంచే అద్భుతమైన గుణాలు ఇందులో ఉన్నాయి.

అందుకే నిద్రపోయే ముందు ఇది తాగితే చక్కగా నిద్రపోతారు. ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి.. యాలకుల పాలు తయారు చేసుకోవడం చాలా సులభం. ఒక గ్లాసు పాలు తీసుకుని అందులో 2 యాలకులు వేసి మరిగించుకోవాలి. వీటిని వడకట్టుకుని తాగడమే. అవసరమైతే కొద్దిగా తేనె వేసుకుని కూడా తాగొచ్చు. యాలకుల వల్ల లాభాలు.. యాలకుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాల్షియం ఉండటం వల్ల ఎముకలకు అవసరమైన బలాన్ని అందిస్తుంది.

కీళ్ల నొప్పులు దరిచేరకుండా అడ్డుకుంటుంది. ఇందులోని విటమిన్ సి సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు నుంచి త్వరగా ఉపశమనం ఇస్తుంది. గొంతు నొప్పిగా అనిపించినప్పుడు కాస్త యాలకులు వేసి టీ తాగితే రిలీఫ్ గా ఉంటుంది. దీని సువాసన వల్ల మంచి మౌత్ ఫ్రెషనర్ గా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎక్కువ సేపు నోరు మూసుకుని ఉండటం వల్ల దుర్వాసన వస్తుంది. అటువంటి సమయంలో ఒక యాలకుల నోట్లో వేసుకుని నమలడం వల్ల చెడు వాసన తొలగిపోతుంది. జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది.

ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నష్టం నుంచి కాపాడతాయి. ఆకలి తక్కువగా ఉన్న వాళ్ళు యాలకులు తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. చలికాలంలో వెచ్చగా ఉండేందుకు శరీర ఉష్ణోగ్రత పెంచుకునేందుకు యాలకులు చక్కగా ఉపయోగపడతాయి. ఉదర సంబంధిత సమస్యలకి ఇది చక్కని పరిష్కారం. ఉబ్బరం, కడుపు మంట వాటిని త్వరగా తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డయాబెటిక్ రోగులు వీటిని నిత్యం తీసుకుంటూ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker