మీ బ్లడ్ గ్రూప్ ని బట్టి మీరు ఎలాంటి ఆహారం తినాలో తెలుసుకోండి.
రక్తంలో ఉండేవి నాలుగు గ్రూపులే. అవి O, B, A, AB. మరి ప్రపంచంలో జనాభా వందల కోట్లు. అందర్నీ ఈ నాలుగు గ్రూపులకే పరిమితం చేయడం కరెక్టేనా అన్నది ఓ చర్చనీయాంశం. అందుకే ఇలాంటి అంచనాల్ని వ్యతిరేకిస్తూనే… చాలా మంది… సరదాగా అసలు తమ గ్రూపు గురించి ఏం చెప్పారా అని తెలుసుకుంటున్నారు. అయితే బరువు తగ్గడానికి చాలా మంది కడుపు మాడ్చుకుంటారు, విపరీతమైన వ్యాయామాలు చేస్తుంటారు, ఇంకా అనేక ఇతర పద్ధతులను అనుసరిస్తారు.
కానీ ఈ పద్ధతులు అందరు వ్యక్తులపై ఒకే విధంగా పనిచేయవు. ఫలితంగా మీరు ఎంత కష్టపడినా అది వృధా ప్రయాసనే. ఇందుకు కారణం ప్రతి వ్యక్తి భిన్నమైన బ్లడ్ గ్రూప్ కలిగి ఉండటమే అని న్యూట్రిషనిస్టులు అంటున్నారు. A బ్లడ్ గ్రూప్ వారు తినాల్సిన ఆహారం.. A బ్లడ్ గ్రూప్ ఉన్నవారి రోగనిరోధక వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. బరువు తగ్గేందుకు వారు ఆహారంలో ఎక్కువగా పండ్లను చేర్చుకోవాలి. అంతే కాకుండా పచ్చి ఆకు కూరలతో పాటు, సలాడ్లు కూడా తీసుకోవాలని సూచించారు. A బ్లడ్ గ్రూప్ కలిగిన వారు మాంసాహారం తక్కువగా తీసుకోవాలి.
బీన్స్, కాయ ధాన్యాలు, చిక్కుళ్ళు వంటి ధాన్యాలు తీసుకోవడం వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. B బ్లడ్ గ్రూప్ వారు తినాల్సిన ఆహారం.. బ్లడ్ గ్రూప్ B కలిగిన వారు తక్కువ కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులను, ప్రోటీన్ ఎక్కువ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. ఇంకా ఈ గ్రూప్ వారు సోయాబీన్, గుడ్లు, పప్పులు, వివిధ రకాల కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. B బ్లడ్ గ్రూప్ ఉన్నవారు బరువు తగ్గడానికి ప్రోటీన్-రిచ్ హెల్తీ ఫుడ్ తీసుకోవడంపై ఆధారపడాలి. AB బ్లడ్ గ్రూప్ వారు తినాల్సిన ఆహారం.. ఎసిడిటీ, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఈ బ్లడ్ గ్రూప్ వ్యక్తులలో ఎక్కువగా కనిపిస్తాయి.
ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు మద్యం, ధూమపానం, కెఫిన్, స్పైసీ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. మీ బ్లడ్ గ్రూప్ AB అయితే మీరు టోఫు, సీ ఫుడ్, పాల ఉత్పత్తులతో పాటు ఆకుపచ్చ కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. ఇలాంటివి తింటూ ఉండటం వలన సులభంగా బరువు తగ్గుతారు. O బ్లడ్ గ్రూప్ వారు తినాల్సిన ఆహారం.. O బ్లడ్ గ్రూప్ ఉన్నవారు AB బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలాగా ఎసిడిటీ కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. దీనితో పాటు మాంసం, బీన్స్, ధాన్యాలు తక్కువగా తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారంపై శ్రద్ధ పెట్టడంతోపాటు, క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలి.