పాకిస్తాన్ లో ఉన్న అతి భయంకరమైన బోర్డర్ ఏదో మీకు తెలుసా …?

పశ్చిమ బెంగాల్లోని హుగ్లీకి చెందిన 40 ఏళ్ల పూర్ణమ్ కుమార్ షా పెట్రోలింగ్ లో భాగంగా తుపాకీతో తిరుగుతూ అనుకోకుండా సరిహద్దు దాటి పాకిస్తాన్ రేంజర్లకు పట్టుబడ్డాడు. దీంతో పూర్ణమ్ విడుదల కోసం అతని కుటుంబం పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు కేంద్రానికి పలు వినతులు చేసింది. అయితే తాజాగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సడలడంతో అతని విడుదల జరిగిందని భావిస్తున్నారు.అయితే ఇవన్నీ జరగకముందు అంటే పహల్గా ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజు అంటే ఏప్రిల్ 23న భారత బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ షా సరిహద్దుల వద్ద పాకిస్తాన్ రేంజర్లకు దొరికిపోయాడు.
అతన్ని తమకు అప్పగించాలని భారత్ ఎన్నిసార్లు కోరినా పట్టించుకోని పాకిస్తాన్ ఇవాళ అనూహ్యంగా అతన్ని అట్టారి చెక్ పోస్ట్ వద్ద భారత జవాన్లకు అప్పగించింది. ఇప్పటివరకూ పాకిస్తాన్ రేంజర్స్ కస్టడీలో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ షాను అమృత్‌సర్‌లోని అట్టారి జాయింట్ చెక్ పోస్ట్ వద్ద ఉదయం 10.30 గంటలకు తమకు అప్పగించినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది.గత నెలలో పెట్రోలింగ్ లో భాగంగా విధుల్లో ఉన్న పూర్ణమ్ కుమార్ పట్టుబడిన తర్వాత వాస్తవానికి ఫ్లాగ్ మీటింగ్స్ ద్వారా ఇరు దేశాల అధికారులు అతన్ని తిరిగి భారత్ కు అప్పగించాల్సి ఉంది.

కానీ పహల్గాం దాడి తర్వాత ఇరు దేశాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతల కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమవుతూ వచ్చింది.గత నెలలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయింది. ఆ ఆపరేషన్ ఉధృతంగా కొనసాగుతున్న తరుణంలోనే అమెరికా జోక్యంతో ఇరు దేశాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ మేరకు కాల్పుల విరమణ అమలు జరుగుతోంది.గత నెలలో అంతర్జాతీయ సరిహద్దును అనుకోకుండా దాటిన పూర్ణమ్ కుమార్ సాహూను పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచీ అతను పాకిస్తాన్ అదుపులోనే ఉన్నాడు.
ఈ అప్పగింత శాంతియుతంగా, ఇప్పటికే అమల్లో ఉన్న ప్రోటోకాల్‌ల ప్రకారం జరిగిందని సరిహద్దు భద్రతా దళం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో అతని కుటుంబం ఊపిరి పీల్చుకుంటోంది.పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే పాక్ పౌరులు భారత్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. భారత్ విధించిన ఆంక్షల కారణంగా ఇప్పటి వరకు 786 మంది పాకిస్థానీయులు అటారీ-వాఘా సరిహద్దు దాటి పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. అదే సమయంలో అక్కడ నుంచి 1,367మంది పౌరులు భారత్ తిరిగి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఉగ్రదాడి తర్వాత భారత్‌లో ఉన్న బిజినెస్, విజిటర్, స్టూడెంట్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్న పాక్ పౌరులు ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని స్పష్టంచేసింది. వైద్య వీసాల కింద ఉన్నవారికి ఏప్రిల్ 29లోపు వెళ్లిపోవాలని గడువు ఇచ్చింది. దౌత్య, అధికారిక, దీర్ఘకాలిక వీసాలు ఉన్నవారికి ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో భారత్ ప్రభుత్వం విధించిన గడువు ముగిసింది. ఏప్రిల్ 24 నుంచి 29వ తేదీ వరకు 786మంది పాకిస్థాన్‌కు వెళ్లారు. 1376మంది పౌరులు భారత్‌కు తిరిగి వచ్చారు. అటు పాకిస్థాన్‌లో ఉంటున్న భారతీయులు కూడా వీలైనంత త్వరగా భారత్‌కు తిరిగి రావాలని హెచ్చరించింది.